ఏపీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం నాడు  నామినేషన్ దాఖలు చేసే ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొన్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి లోకేష్ పోటీ చేస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేష్ తొలిసారి పోటీకి దిగుతున్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేష్ ఇప్పటికే  విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.