విజయనగరం: విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో అక్టోబర్ 25న జరిగిన తనపై దాడి ముమ్మాటికి కుట్రేనని వైఎస్ జగన్ ఆరోపించారు. విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బహిరంగ సభలో తనపై జరిగిన దాడి గురించి జగన్ ప్రజలకు వివరించారు. 

తనను మట్టుబెట్టేందుకు మార్చినెలలోనే చంద్రబాబు నాయుడు ప్లాన్ వేశారని జగన్ వివరించారు. అందుకు ఓ సినీనటుడును తన దగ్గరుకు తెచ్చుకున్నారని అతడికి శిక్షణ ఇచ్చాడన్నారు.  శిక్షణ పూర్తైన తర్వాత మార్చి 22న ఆ సినీనటుడితో ఒక ప్రెస్మీట్ పెట్టించారని జగన్ గుర్తు చేశారు. 

ఆ సినీనటుడు ప్రెస్మీట్ లో ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని చంద్రబాబు తన స్క్రిప్ట్ ను ఆ నటుడిచేత చదివించారని జగన్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతపై దాడి జరిగిన తర్వాత రాష్ట్రం అల్లకల్లోలమైపోతుందని ప్రభుత్వం కుప్పకూలిపోతుందని ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగమేనని చెప్పించారన్నారు. ఇదంతా బీజేపీ చేస్తున్న ఆపరేషన్ అంటూ చెప్పించినట్లు ధ్వజమెత్తారు. ఆ సినీనటుడు చెప్పిన స్క్రిప్ట్ ను ఓ మీడియా పదేపదే ప్రజలకు చూపించిందని చెప్పుకొచ్చారు.  

అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు తనపై దాడి చెయ్యించారని జగన్ ఆరోపించారు. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగితే అది కేంద్రప్రభుత్వంపై పోతుందని అది తమ పరిధిలోకి రాదని చెప్పి తప్పించుకుందామని ప్లాన్ వేశారని మండిపడ్డారు. 

ఒక వేళ హత్యాయత్నాంలో ప్రతిపక్ష నేత చనిపోతే కేంద్రంపై నెట్టేద్దామని ఒక వేళ ఫెయిల్ అయితే ఆపరేషన్ గరుడలో భాగమేనని చెప్పొచ్చు అంటూ తెలివిగా ప్లాన్ చేశారని ఆరోపించారు. అంతటి సెక్యూరిటీ నడుమ ఎయిర్ పోర్ట్ లాంజ్ లో కత్తులు ఎలా వచ్చాయంటే అది కూడా చంద్రబాబు నాయడు సన్నిహితుడు వల్లేనని జగన్ చెప్పుకొచ్చారు. 

హోటల్ యజమాని హర్షవర్ధన్ చౌదరి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరన్నారు. నిందితుడు శ్రీనివాస్ అతని దగ్గరే పని చేస్తున్నారని జగన్ గుర్తు చేశారు. అందువల్లే నిందితుడు ఎయిర్ పోర్ట్ లాంజ్ లోకి కత్తులు తీసుకురాగలిగాడని జగన్ చెప్పారు. ఇది కుట్రగా కనిపించడం లేదా చంద్రబాబు అంటూ జగన్ నిలదీశారు. 

హత్యాయత్నం జరిగిన గంట తర్వాత డీజీపీ ఆర్పీ ఠాకూర్, హోం మంత్రి చినరాజప్పలు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్స్ తో మీడియా ముందుకు వచ్చారని జగన్ చెప్పారు. అలాగే చంద్రబాబుకు చెందిన మంత్రులు వచ్చి జగన్ పై దాడి చేసింది జగన్ అభిమానేనని తప్పుడు ప్రకటనలు చేశారని మండిపడ్డారు.  

 అయ్యా చంద్రబాబు నాయుడు తనపై దాడి చేసింది జగన్ అభిమాని అని చెప్తున్నారు. జగన్ సిఎం కావాలని సీఎం అయిన తర్వాత గొప్పగా పరిపాలించాలని ఆ యువకుడు ఆశపడ్డాడని ఇలా అన్నీ చంద్రబాబే చెప్తున్నాడని జగన్ మండిపడ్డారు. జగన్ గొప్పగా పరిపాలించాలని అనుకునే వ్యక్తి ఎందుకు చంపాలనుకుంటాడో చెప్పాలని నిలదీశారు. 

ఘటన జరిగిన గంట లోపే తన వారితో చేయించి జగన్ అభిమాని అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కుట్రపన్నారని జగన్ మండిపడ్డారు. ఫ్లెక్సీ చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. హత్య జరిగిన గంట తర్వాత ఫ్లెక్సీ విడుదల చేస్తారని అందులో నిందితుడు ఫోటో నా ఫోటో ఉంటుందని కానీ పైన వైఎస్ఆర్ ఫోటో కానీ విజయమ్మ ఫోటో కానీ, సోదరి షర్మిల ఫోటో కానీ ఉండదని పైన గరుడ పక్షి ఫోటో ఉంటుందని దుయ్యబుట్టారు. హత్యాయత్నం జరిగిన తర్వాత 30 మంది మధ్యలోనే నిందితుడిని సీఐఎస్ఎఫ్ పోలీసులు తనఖీ నిర్వహించారని కానీ ఎక్కడా లేఖ కనిపించలేదన్నారు. 

కానీ గంట తర్వాత డీజీపీ లేఖ ఉందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఆ లేఖ కూడా పది గంటలకు విడుదల చేశారని ఆ లేఖలో రెండు మూడు చేతిరాతలు ఉన్నాయన్నారు. ఆ లేఖ ముడతలు పడలేదని ఇస్త్రీ చేసినట్లు ఉందన్నారు. ఇది కుట్రగా కనిపించలేదా సీఎం చంద్రబాబుని జగన్ అని ప్రశ్నించారు. 

తాను ఆగష్టు నెలలో ప్రజా సంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టానని అప్పటి నుంచే విశాఖ ఎయిర్ పోర్ట్ లో సీసీ కెమెరాలు పనిచెయ్యడం లేదట అని జగన్ చెప్పుకొచ్చారు. ఆనాటి నుంచి మూడు నెలలపాటు సీసీ కెమెరాలు పని చెయ్యడం లేదని చంద్రబాబు మనుషులు చెప్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ కుట్ర కాదా చంద్రబాబు అంటూ ఆగ్రమం వ్యక్తం చేశారు.

 హత్యాయత్నం  ఘటనపై చంద్రబాబు నాయుడు దిగజారిన ఆరోపణలు చేయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుట్ర చంద్రబాబు చేయించి తన కుటుంబ సభ్యులు చేయించారంటూ తన అమ్మ, చెల్లిని తెరపైకి తీసుకువచ్చారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఒక అమ్మని, ఒక చెల్లిని హత్య చేయించారంటూ నిందలు మోపుతారా అంటూ ప్రశ్నించారు. ఈ ఆరోపణ తనను ఎంతగానో బాధించిందని జగన్ వాపోయారు. 

హత్యాయత్నం అనంతరం ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు తాను హైదరాబాద్ వెళ్లిపోయినట్లు తెలిపారు. తాను ఎవరిమీద కామెంట్ చెయ్యలేదన్నారు. ఎందుకు జరిగింది ఎలా జరిగిందో తెలియదు కాబట్టి ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని షర్ట్ అక్కడే వదిలి హైదరాబాద్ కు వెళ్లిపోయానన్నారు. అయితే తాను బాగానే ఉన్నానని ట్వీట్ ఇవ్వండని కూడా కార్యకర్తలకు చెప్పానన్నారు. 

అయితే తాను విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లి అక్కడ నుంచి ఆస్పత్రికి వెళ్లానని అది కూడా కత్తికి విషం పూసి ఉంటే ప్రమాదం ఉండొచ్చన్న ఆందోళనతో వెళ్లానన్నారు. దానిపై కూడా చంద్రబాబు నాయుడు తప్పుడు కథనాలు అల్లించారన్నారు. 

తాను ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లానని అక్కడ బీజేపీ నేతలు ఫోన్ చేస్తే ఆస్పత్రికి వెళ్లానని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. 
ఇంతకంటే నీచమైన రాజకీయం ఇంకేమైనా ఉందా అంటూ నిలదీశారు. హత్యాయత్నం చేయించింది చంద్రబాబు నాయుడు విచారణ చేయించింది చంద్రబాబే. మరి అలాంటప్పుడు తనకు న్యాయం ఎలా జరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. నువ్వు కుట్ర చెయ్యకపోతే ఎందుకు స్వతంత్ర సంస్థల విచారణకు ఎందుకు అంగీకరించడం లేదని నిలదీశారు. 

గతంలో తాను ఓదార్పుయాత్ర కోసం కాంగ్రెస్ పార్టీతో విబేధిస్తే అధికారం కోసం కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై సీబీఐతో తనపై కేసులు పెట్టించారని నిప్పులు చెరిగారు. ఆనాడు ముద్దు అయిన సీబీఐ నేడు వద్దు అంటున్నావా అని నిలదీశారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలు, హత్యాయత్నం కేసులు బయటకు వస్తాయని భయంతో వణుకు పోతున్నారన్నారు. 

అవన్నీ బయటపడకుండా ఉండేందుకు మోదీపై యుద్ధం అంటూ కొత్త డ్రామా ఆడుతున్నారని దుయ్యబుట్టారు. సీబీఐ దర్యాప్తు చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో సీబీఐకు నో ఎంట్రీ బోర్డులు పెట్టారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గుడిని, నక్కజిత్తుల పన్నాగాలు పన్నే వ్యక్తిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. 

పురాణాలలో రావణాసురుడు, నరకాసురుడు, శిశుపాలుడు, కంసుడు వీళ్లందరికన్నా పెద్ద రాక్షసుడు చంద్రబాబేనని జగన్ ధ్వజమెత్తారు. వాళ్ల రాక్షస పాలన కంటే చంద్రబాబు రాక్షస పాలన ఘోరమన్నారు.

 చంద్రబాబు నాయుడు లాంటి దుష్టశక్తులు ఎన్ని కుట్రలు చేసినా తాను ప్రజల కోసం నాపోరాటం ఎన్నటికీ ఆగిపోదు. నా సంకల్పం ఎన్నటికి సడలిపోదు. నా ఒంట్లో చివరి నెత్తురు బొట్టు కూడా ప్రజల కోసమే తపిస్తానని హామీ ఇచ్చారు.   
 
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యింది కేవలం డబ్బు సంపాదించడం కోసమేనని జగన్ ఆరోపించారు. డబ్బు సంపాదించడం, అవినీతి కోసమే చంద్రబాబు సీఎం అయ్యారన్నారు. తాను సీఎం కావాలనుకుంటున్నది ప్రజల కోసమే తప్ప డబ్బు కోసం కాదన్నారు. తనకు ఎప్పుడూ డబ్బు వ్యామోహం లేదన్నారు.  

ప్రజలు సీఎంగా ఒక్కసారి అవకాశం ఇస్తే 30 ఏళ్ళపాటు ప్రజల గుండెల్లో నిలిచిపోతానని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఒక వేళ తాను చనిపోయినా తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోతోపాటు తన ఫోటో కూడా ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. నిత్యం ప్రజల సంక్షేమమే తన ప్రాణం ఉవ్విళ్లూరుతుందన్నారు.   

ఈ వార్తలు కూడా చదవండి

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్‌పై దాడి కేసు: చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

జగన్‌పై దాడి: పర్మిట్ లేని శ్రీనివాస్ అక్కడికి ఎలా వెళ్లాడు

జగన్‌పై దాడి: సీసీకెమెరాల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం

జగన్ పై దాడి కేసు.. నేడు హైకోర్టులో విచారణ

జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే

జగన్‌ను ప్రజలే కాపాడుకొన్నారు: కన్నీళ్లు పెట్టుకొన్న విజయమ్మ

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌కు 120 కాల్స్, ఎవరీ కేకే

జగన్ పై దాడి.. హైకోర్టు సంచలన కామెంట్స్

జగన్‌పై దాడి: జోగి రమేష్‌ విచారణ, గుంటూరులో ఉద్రిక్తత

 శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...