న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్టుగా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రకటించారు.

గురువారం నాడు న్యూఢిల్లీలో  సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు.  తాము బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా  ఆయన తెలిపారు.సాయంత్రం ఏడు గంటలకు తాను అన్ని విషయాలను వెల్లడించనున్నట్టు చెప్పారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలకు సుజనా చౌదరి సమాధానం చెప్పలేదు.

అన్ని విషయాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించనున్నట్టు తెలిపారు. మోడీ ప్రభుత్వం నుండి వైదొలగడాన్ని  అప్పుడు మంత్రిగా ఉన్న సుజనా చౌదరి వ్యతిరేకించారు. 

మంత్రివర్గం నుండి బయటకు వచ్చినా కూడ కనీసం ఎన్డీఏలో కొనసాగాలని తాను సూచించినా కూడ చంద్రబాబు వినలేదని  సుజనా చౌదరి మీడియాకు ఇటీవల చెప్పారు.

ఎన్నికల సమయంలో  టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు లక్ష్యంగా  ఈడీ, ఐటీ దాడులు కొనసాగిన విషయం తెలిసిందే. రాజ్యసభలో టీడీపీ ఎంపీల్లో ముగ్గురు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. 

సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావులు అత్యంత సన్నిహితులు. టీజీ వెంకటేష్ 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ నుండి టీడీపీలోకి వచ్చారు. అంతకు ముందు కూడ ఆయన టీడీపీలో కొంతకాలం ఉండి... ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు.

సంబంధిత వార్తలు

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్

చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?

చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే..