
Pawan Kalyan Visits Kakinada GGH Firecracker Blast Victims
కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటన క్షతగాత్రులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు. కాలిన గాయాలతో ఉన్న బాధితులను చూసి చలించిపోయిన ఉపముఖ్యమంత్రి, ఘటనకు గల కారణాలపై జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పడంతో పాటు, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.