విజయవాడ:బ్యూటీషీయన్  పద్మపై దాడికి దిగిన నూతన్ కుమార్ ఆత్మహత్య చేసుకొన్నాడు. సంఘటనా స్థలం వద్ద  నూతన్ కుమార్ భార్య సంచలన ఆరోపణలు చేశారు.  తన భర్తతో బ్యూటీషీయన్  పద్మతో వివాహేతర సంబంధం విషయం భర్త సూర్యనారాయణకు కూడ తెలుసునని చెప్పారు. డబ్బుల కోసమే పద్మ తన భర్త నూతన్‌కుమార్‌తో సంబంధాన్ని కొనసాగించిందని  ఆమె ఆరోపించారు.అయితే ఈ ఆరోపణలను పద్మ భర్త సూర్యనారాయణ ఖండించారు.

బ్యూటీషీయన్ పద్మపై దాడికి పాల్పడిన  ఆమె ప్రియుడు నూతన్‌కుమార్  ఆదివారం నాడు నర్సరావుపేట వద్ద  రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగేళ్లుగా బ్యూటీషీయన్ పద్మకు, నూతన్ కుమార్ కు మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది.

అయితే  ఈ విషయం తెలిసిన సమయంలో  నూతన్ కుటుంబసభ్యులకు చెప్పి ఈ బంధాన్ని తెంచుకోవాలని కోరినట్టు సూర్యనారాయణ చెబుతున్నారు. మరో వైపు  ఈ విషయమై  నూతన్ కుటుంబసభ్యులు కూడ ఒత్తిడి తెచ్చారని సూర్యనారాయణ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

మరో వైపు  నూతన్ కుమార్  వద్ద ఉన్న డబ్బుల కోసమే పద్మను  ఆమె భర్త సూర్యనారాయణే పంపేవాడని  నూతన్ కుమార్ భార్య సంచలన ఆరోపణలు చేసింది. సోమవారం నాడు ఆమె మృతదేహన్ని గుర్తుపట్టిన తర్వాత ఆమె ఈ ఆరోపణలు చేసింది.

నూతన్ కుమార్ వద్ద ఉన్న డబ్బులు అయిపోయాక అతడితో సంబంధాలు తెంచుకొనేందుకు యత్నించారని ఆమె ఆరోపణలు చేశారు. పద్మతో  నూతన్ కుమార్ వివాహేతర సంబంధం పెట్టుకొన్న విషయం తెలిసిన తర్వాత నూతన్ కుమార్ కు ఆయన భార్య దూరంగా ఉంటున్నారు.

అయితే నూతన్ భార్య చేసిన ఆరోపణలను పద్మ భర్త సూర్యనారాయణ ఖండించాడు. తమ కుటుంబాన్ని అల్లరిపాలు చేస్తున్నాడని నూతన్ కుటుంబసభ్యులను పలుమార్లు  చెప్పినట్టు ఆయన గుర్తు చేశారు. 

ప్రతి సారీ తన బ్యాగులో విషం బాటిల్ పెట్టుకొని  తాను సూసైడ్ చేసుకొంటానని నూతన్ బెదిరించి తమను బెదిరింపులకు గురిచేశాడని సూర్యనారాయణ చెప్పాడు.గతంలో కూడ  నూతన్ కుమార్ ఆత్మాహత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. నూతన్ కుమార్ నుండి  చిల్లిగవ్వ కూడ తాము తీసుకోలేదన్నారు. 

ఈ వార్తలు చదవండి

బ్యూటీషీయన్ పద్మ కేసు: నుదిటిపై ఎస్ అక్షరం వెనుక నూతన్

బ్యూటీషీయన్ పద్మ కేసు: నూతన్‌కుమార్‌‌ చరిత్ర ఇదీ

బ్యూటీషీయన్ పద్మ కేసులో ట్విస్ట్: ప్రియుడు నూతన్ సూసైడ్

బ్యూటీషీయన్ పద్మపై దాడి: సుబ్బయ్య ఎవరు? ఆరా తీస్తున్న పోలీసులు

బ్యూటీషీయన్‌పై దాడి: మత్తు ఇంజక్షన్ ఇచ్చి కత్తి గాట్లు, ప్రియుడెక్కడ?

అఫైర్: కాళ్లూ చేతులూ కట్టేసి బ్యుటిషియన్ పై దాడి