- Home
- Telangana
- School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి పండగే... డిసెంబర్ 23 నుండి 27 వరకు స్కూళ్లకు క్రిస్మస్ హాలిడేస్
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి పండగే... డిసెంబర్ 23 నుండి 27 వరకు స్కూళ్లకు క్రిస్మస్ హాలిడేస్
ఈ క్రిస్మస్ కి ఒకటి రెండ్రోజులు కాదు కొందరు తెలుగు విద్యార్థులకు ఏకంగా ఐద్రోజులు సెలవులు వస్తున్నాయి. మరికొందరు విద్యార్థులకు 3 రోజులు, ఉద్యోగులకు నాల్రోజులు సెలవులున్నాయి.

క్రిస్మస్ సెలవులు
Christmas Holidays 2026 : సాధారణంగా వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు ప్రారంభంకాగానే విద్యార్థులు మూడు పండగ సెలవులపై ఆశలు పెట్టుకుంటారు... అవి దసరా, క్రిస్మస్, సంక్రాంతి. వేసవి స్థాయిలో నెలలు కాకున్నా ఈ పండగలకు వరుసగా కొన్నిరోజులు సెలవులుంటాయి. ఇలా ఇప్పటికే దసరాకి 12-13 రోజులు విద్యార్థులకు సెలవులు వచ్చాయి... మిగిలింది క్రిస్మస్, సంక్రాంతి సెలవులే. వచ్చేనెలలో (డిసెంబర్ 2026) క్రిస్మస్, ఆ తర్వాతి నెల (జనవరి 2027) సంక్రాంతి పండగలున్నాయి... ఈ పండగలకు ఎన్నిరోజుల సెలవులున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
క్రిస్మస్ కి ఐద్రోజుల సెలవులు
ఈ క్రిస్మస్ కి తెలుగు విద్యార్థులకు వరుసగా ఐద్రోజులు సెలవులు వస్తున్నాయి. 2026 డిసెంబర్ 23 నుండి 27 వరకు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నట్లు ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ లో పేర్కొంది. అయితే ఈ సెలవులు అన్ని విద్యాసంస్థలకు వర్తించవు... కేవలం మిషనరీ స్కూల్స్ కే ఐద్రోజులు సెలవులని విద్యాశాఖ స్పష్టంగా పేర్కొంది. అయితే ఎస్సి గురుకులాలు, మైనారిటీ విద్యాసంస్థలకు కూడా క్రిస్మస్ కు ఐదురోజులు సెలవులు ఇచ్చే అవకాశాలుంటాయి.
మూడ్రోజుల సెలవులయితే పక్కా
ఇక ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు క్రిస్మస్ కి ఐదురోజులు కాకున్నా మూడ్రోజులు సెలవులు ఉండనున్నాయి. డిసెంబర్ 25న (శుక్రవారం) క్రిస్మస్ పండగ... ఈరోజు అధికారిక సెలవు ఉంటుంది. ఇక పండగ తర్వాతిరోజు డిసెంబర్ 26 (శనివారం) క్రిస్మస్ తర్వాతి రోజు లేదా బాక్సింగ్ డే సందర్భంగా కూడా అధికారిక సెలవు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక డిసెంబర్ 27 (ఆదివారం) సాధారణ సెలవు. ఇలా ఈ క్రిస్మస్ వీకెండ్ లో రావడంతో వరుసగా మూడ్రోజులు సెలవులు కలిసి వస్తున్నాయి.
ఉద్యోగులకు నాల్రోజుల క్రిస్మస్ సెలవులు
తెలంగాణ విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ క్రిస్మస్ కి వరుస సెలవులు రాబోతున్నాయి. డిసెంబర్ 24 నుండి డిసెంబర్ 27 వరకు అంటే నాల్రోజులు సెలవులున్నాయి... ఇందులో ఒకటి ఆప్షనల్ హాలిడే, ఇంకోటి ఆదివారం కాగా మిగతా రెండు పండగ సెలవులు.
డిసెంబర్ 24 (గురువారం) : క్రిస్మస్ ఈవ్ - ఆప్షనల్ హాలిడే (ముందుస్తు అనుమతితో వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు... ముఖ్యంగా క్రిస్టియన్ ఉద్యోగులు తీసుకుంటారు. ఈ సెలవు అందరు ఉద్యోగులకు వర్తించదు.
డిసెంబర్ 25 (శుక్రవారం) : క్రిస్మస్ పండగరోజు అధికారిక సెలవు ఉంది. ఈరోజు క్రిస్టియన్స్ చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.. కేక్ కటింగ్ చేస్తూ వైభవంగా వేడుకలు జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతాయి... అందుకే అందరికీ సెలవు ఉంటుంది.
డిసెంబర్ 26 (శనివారం) : క్రిస్మస్ పండగ తర్వాతరోజు బాక్సింగ్ డే వేడుకలు జరుగుతాయి. క్రిస్మస్ తర్వాతిరోజు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు... అంతేకాదు యజమానులు తమవద్ద పనిచేసేవారికి కూడా బహుమతులు ఇస్తుంటారు... దీన్నే బాక్సింగ్ డే అంటారు. ఈరోజు కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవుగా ప్రకటించింది.
డిసెంబర్ 27 (ఆదివారం) : ప్రతి వీకెండ్ లో ఆదివారం ఉద్యోగులు, విద్యార్థులకు సెలవు ఉంటుంది. ఇలా డిసెబర్ 27న ఆదివారమే కాబట్టి సాధారణ సెలవు ఉంటుంది. అయితే ముందు వరుసగా మూడ్రోజులు క్రిస్మస్ సెలవులు ఉండటంతో ఈ సండే సెలవు కూడా కలిసివచ్చి క్రిస్మస్ కు నాల్రోజులు సెలవులు వస్తున్నాయి.













