ట్రయాంగిల్ లవ్ స్టోరీ: ప్రియురాలి స్నేహితురాలితో ఎఫైర్, ట్విస్టిచ్చిన ఫస్ట్ లవర్

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 27, Aug 2018, 10:54 AM IST
prem kumar arrested for cheating woman in hyderabad
Highlights

ప్రేమించానని నమ్మించి ఆమెతో సహజీవనం చేస్తున్న  ప్రేమ్‌కుమార్ అనే యువకుడు తన ప్రియురాలి స్నేహితురాలితో కూడ లవ్ అఫైర్ నడిపాడు.అయితే ఈ విషయమై సహజీవనం చేస్తున్న యువతి ప్రేమ్‌ను నిలదీయడంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

హైదరాబాద్:ప్రేమించానని నమ్మించి ఆమెతో సహజీవనం చేస్తున్న  ప్రేమ్‌కుమార్ అనే యువకుడు తన ప్రియురాలి స్నేహితురాలితో కూడ లవ్ అఫైర్ నడిపాడు.అయితే ఈ విషయమై సహజీవనం చేస్తున్న యువతి ప్రేమ్‌ను నిలదీయడంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు చంపేస్తానని బెదిరించాడు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రేమ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

హైద్రాబాద్‌లోని  బంజారాహిల్స్  రోడ్ నెంబర్ 12లోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటున్న  ప్రేమ్‌కుమార్ స్థానికంగా ఉంటున్న ఓ యువతితో పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం  ప్రేమకు దారి తీసింది. ఆమెను పెళ్లి చేసుకొంటానని నమ్మించాడు.  వీరిద్దరూ అదే ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని సహ జీవనం చేస్తున్నారు.

ప్రేమ్‌కుమార్ లవర్  స్నేహితురాలు  తరచూ ఆ గదికి వచ్చేది. తన స్నేహితురాలిని కలుసుకొనేందుకు ఆమె తరచూ రాకపోకలు సాగించేది. ఈ తరుణంలోనే ప్రేమ్ కుమార్‌ కు కూడ ఆమెతో పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకొన్న ప్రేమ్‌కుమార్ ఆమెతో కూడ ప్రేమాయాణం సాగించాడు.ఆమెను కూడా లోబర్చుకొన్నాడు. ఈ విషయం తెలిసిన  సహజీవనం చేస్తున్న యువతి ప్రేమ్‌కుమార్ ను నిలదీసింది. దీంతో ప్రేమ్ రెచ్చిపోయాడు ఆ యువతిపై దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు చంపేస్తానని కూడ బెదిరింపులకు పాల్పడ్డాడు.

రెండో యువతితోనే తాను ఉంటానని చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ప్రేమ్‌కుమార్ ను అరెస్ట్ చేశారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

loader