MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Delimitation Bill: డీలిమిటేషన్‌తో మారనున్న పొలిటికల్ మ్యాప్.. ఏపీ, తెలంగాణ సీట్ల లెక్కలు ఇవే

Delimitation Bill: డీలిమిటేషన్‌తో మారనున్న పొలిటికల్ మ్యాప్.. ఏపీ, తెలంగాణ సీట్ల లెక్కలు ఇవే

Delimitation Bill: అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ సీట్లు 50% పెంచే బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ, తెలంగాణలో సీట్ల లెక్కలు ఎలా ఉన్నాయి? డీలిమిటేషన్‌తో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతోంది?

4 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 28 2026, 09:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
డీలిమిటేషన్ ఎఫెక్ట్: ఏపీ, తెలంగాణ వాటా ఎంత పెరుగుతుంది? 2029 ఎన్నికల లెక్క ఇదే
Image Credit : chatgpt తో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

డీలిమిటేషన్ ఎఫెక్ట్: ఏపీ, తెలంగాణ వాటా ఎంత పెరుగుతుంది? 2029 ఎన్నికల లెక్క ఇదే

దేశ రాజకీయాల్లో పెద్ద మార్పులకు తెరలేపేలా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జనగణనతో సంబంధం లేకుండా, అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ సీట్లను కూడా 50 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఢిల్లీలో ఆమోదం తెలిపింది. గతంలో తీసుకొచ్చిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు పలు మార్పులు చేసి తాజా బిల్లును రెడీ చేశారు. ఈ నెల 30న ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు.

గత ఏప్రిల్‌లోనే ఈ బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకొచ్చినా, 50 శాతం పెంపు అంశం లిఖితపూర్వకంగా లేదంటూ విపక్ష ఇండియా కూటమి అభ్యంతరం చెప్పడంతో 2/3 వంతు మెజార్టీ రాక వీగిపోయింది. ఆ పాత బిల్లును సాంకేతికంగా ఉపసంహరించుకుని, ఇప్పుడు కొత్త సవరణలతో ముందుకు వస్తున్నారు.

పార్లమెంటులో లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పెంపు (132వ రాజ్యాంగ సవరణ బిల్లు), కేంద్రపాలిత ప్రాంతాల్లో సీట్ల పెంపు, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి మొత్తం మూడు బిల్లులను తీసుకురానున్నారు. దేశంలో లోక్‌సభ గరిష్ఠ స్థానాలను 850కి (రాష్ట్రాల్లో 815, యూటీల్లో 35), అసెంబ్లీల గరిష్ఠ పరిమితిని 500 నుంచి 650కి పెంచేలా ప్రతిపాదనలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 50 శాతం పెంపు వల్ల సీట్లు 600 దాటే అవకాశం ఉన్నందున, అక్కడ 650 వరకు పెంచుకునేలా ప్రత్యేక నిబంధనను కూడా చేరుస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
దక్షిణాదికి భరోసా.. 2051 వరకు అదే నిష్పత్తి
Image Credit : Asianet News

దక్షిణాదికి భరోసా.. 2051 వరకు అదే నిష్పత్తి

డీలిమిటేషన్ వస్తే దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల వాటా తగ్గుతుందేమోనన్న ఆందోళన చాలాకాలంగా ఉంది. ఆ టెన్షన్‌ను తగ్గించేందుకే అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం సీట్లు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల డీలిమిటేషన్ తర్వాత కూడా ఏ రాష్ట్రమూ తన ప్రాతినిధ్య నిష్పత్తిని పెద్దగా కోల్పోదు. అంతేకాదు, రాష్ట్రాల వారీగా లోక్‌సభ స్థానాల సంఖ్యను, ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్ల పాటు అంటే 2051 వరకు ఇలాగే కొనసాగిస్తారు. ఆర్టికల్ 54, 55, 81, 82, 170, 330, 332, 334ఏ వంటి రాజ్యాంగ నిబంధనలకు సవరణలు చేయనున్నారు.

1976లో 42వ రాజ్యాంగ సవరణతో 1971 జనాభా నిష్పత్తి ప్రకారం సీట్ల సంఖ్యను స్తంభింపజేయగా, 2001లో 84వ సవరణతో 2026 వరకు పొడిగించారు. ఇక డీలిమిటేషన్ కమిషన్‌కు సిట్టింగ్ లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వం వహిస్తారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. ప్రతి రాష్ట్రం నుంచి ఐదుగురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు సహాయకులుగా ఉంటారు.

36
తెలంగాణలో సీట్ల లెక్క: 26 ఎంపీ, 182 ఎమ్మెల్యే సీట్లు?
Image Credit : our own

తెలంగాణలో సీట్ల లెక్క: 26 ఎంపీ, 182 ఎమ్మెల్యే సీట్లు?

ఈ బిల్లు ఆమోదం పొందితే తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా, 50 శాతం పెంపుతో ఆ సంఖ్య 26కు చేరుతుందని అంచనా. అసెంబ్లీ విషయానికి వస్తే, 2014 విభజన చట్టం ప్రకారం ఒక్కో లోక్‌సభ పరిధిలో రెండు చొప్పున 34 సీట్లు పెరగాల్సి ఉన్నా, తాజా బిల్లుతో 50 శాతం పెంపు అమలైతే కొత్తగా 60 అసెంబ్లీ సీట్లు వస్తాయి. మరో లెక్క ప్రకారం, ఒక్కో లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడు సెగ్మెంట్ల చొప్పున లెక్కిస్తే మొత్తం అసెంబ్లీ స్థానాలు 182కి చేరవచ్చని అంచనా వేస్తున్నారు.

2024 అంచనాల ప్రకారం తెలంగాణ జనాభా సుమారు 3.84 కోట్లుగా ఉండగా, సమగ్ర కుటుంబ కుల గణన సర్వేలో దాదాపు 3.71 కోట్లు నమోదైంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేస్తే, పాత 10 జిల్లాలను యూనిట్లుగా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జనాభా ఎక్కువగా ఉన్నందున అక్కడే ఎక్కువ సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది. పట్టణ ప్రాంతాల్లో సీట్లు పెరిగి, గ్రామీణ ప్రాంతాల్లో తగ్గే అవకాశం కూడా కనిపిస్తోంది. నియోజకవర్గాల హద్దులు మారి, కొన్ని సెగ్మెంట్లు రెండు మూడుగా విడిపోవచ్చు, మరికొన్నిచోట్ల గ్రామాలు, మండలాలు కలవవచ్చు.

46
ఏపీలో భారీ మార్పులు.. 38 ఎంపీ, 263 ఎమ్మెల్యే సీట్లు
Image Credit : our own

ఏపీలో భారీ మార్పులు.. 38 ఎంపీ, 263 ఎమ్మెల్యే సీట్లు

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ మార్పుల ప్రభావం భారీగానే ఉండబోతోంది. బిల్లు ప్రకారం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు 263కి, 25 లోక్‌సభ స్థానాలు 38కి పెరిగే అవకాశం ఉంది. ఏపీలో పెరిగే లోక్‌సభ సీట్ల విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రస్తావించారు.

దేశవ్యాప్తంగా చూస్తే లోక్‌సభ స్థానాలు 543 నుంచి 816కి (గరిష్ఠ పరిమితి 850 అయినా ప్రస్తుత పెంపు లెక్కల ప్రకారం 816), అసెంబ్లీ స్థానాలు 4,123 నుంచి 6,185కి చేరుతాయి. ఇక దక్షిణాది రాష్ట్రాల వాటా చూస్తే.. లోక్‌సభ 816కు పెరిగితే తమిళనాడు 7.18% నుంచి 7.23%కి, కర్ణాటక 5.15% నుంచి 5.14%కి, ఆంధ్రప్రదేశ్ 4.60% నుంచి 4.65%కి, కేరళ 3.68% నుంచి 3.67%కి, తెలంగాణ 3.13% నుంచి 3.18%కి మారే అవకాశం కనిపిస్తోంది.

గతంలో 2002లో జస్టిస్ కులదీప్ సింగ్ కమిషన్ 2001 జనాభా లెక్కల ఆధారంగా సీట్ల సంఖ్య పెంచకపోయినా నియోజకవర్గాలను సర్దుబాటు చేసింది. అప్పట్లో ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ చుట్టుపక్కల వలసల వల్ల తెలంగాణలో 12 అసెంబ్లీ సీట్లు పెరిగి, కోస్తాంధ్ర-రాయలసీమలో తగ్గాయి. లోక్‌సభ సీట్లు తెలంగాణలో 15 నుంచి 17కు పెరగగా, కోస్తాంధ్ర-రాయలసీమలో 27 నుంచి 25కు తగ్గాయి. ఇప్పుడు మళ్లీ సరిహద్దులు మారితే పొలిటికల్ సమీకరణాలు కూడా మారతాయి.

56
మహిళలకు 33% కోటా.. నేతల్లో టెన్షన్, కొత్తవారికి ఆశలు
Image Credit : Kavitha Kalvakuntla/X

మహిళలకు 33% కోటా.. నేతల్లో టెన్షన్, కొత్తవారికి ఆశలు

ఈ బిల్లులోని మరో పెద్ద హైలైట్ మహిళా రిజర్వేషన్లు. 2023లో 106వ రాజ్యాంగ సవరణ ద్వారా 33 శాతం మహిళా రిజర్వేషన్ చట్టం చేసినా, తొలి జనగణన తర్వాతే అమలు చేయాలని అప్పట్లో పెట్టారు. కానీ 2027 మార్చి 1న ముగిసే జనగణన డేటా 2029 ఎన్నికల షెడ్యూల్ లోపు రావడం కష్టమని భావించి, ఇప్పటికే ఉన్న 2011 జనాభా లెక్కల ఆధారంగానే 2029 ఎన్నికల్లో 33 శాతం కోటా అమలు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ రిజర్వేషన్లు తొలుత 15 ఏళ్ల పాటు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలోనూ మహిళలకు ఉప కోటా ఉంటుంది. ప్రతి డీలిమిటేషన్ తర్వాత రిజర్వుడు సీట్లను రొటేట్ చేస్తారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం మహిళా రిజర్వేషన్ అమలైతే ఏపీలో 13 లోక్‌సభ, 87 అసెంబ్లీ సీట్లు మహిళలకు దక్కొచ్చు. తెలంగాణలో 8 లేదా 9 లోక్‌సభ, సుమారు 60 అసెంబ్లీ సీట్లు మహిళలకు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే యువతకు, కొత్త నేతలకు భారీ ఛాన్సులు వస్తాయి.

66
రాజకీయంగా కొత్త మలుపు
Image Credit : Asianet News

రాజకీయంగా కొత్త మలుపు

మరోవైపు రాజకీయంగానూ ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ఎన్‌సీపీ (ఎస్పీ) నేత శరద్ పవార్ పునర్విభజన అవసరం అని సంకేతాలు ఇవ్వడం, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలేకు కేంద్ర క్యాబినెట్ బెర్త్‌పై చర్చలు జరుగుతుండటం ఆసక్తి రేపుతోంది. అలాగే డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తమ రాష్ట్ర సీట్ల వాటా (7.18 శాతం) తగ్గకూడదని, 25 ఏళ్లు ప్రాతినిధ్య నిష్పత్తి మారకూడదని కోరగా, క్యాబినెట్ సవరణలతో ఆ డిమాండ్లకు సమాధానం దొరికినట్టు కనిపిస్తోంది.

టీవీకేతో పొత్తు వ్యవహారం తర్వాత డీఎంకేతో మళ్లీ కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని, మమతా బెనర్జీ మధ్యవర్తిత్వం నెరపుతున్నారనే వార్తలు కూడా రాజకీయ వేడిని పెంచుతున్నాయి. 2029 ఎన్నికల నాటికి ఈ లెక్కలన్నీ ఎలా మారుతాయనే ఆసక్తి నెలకొంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశం
భారత పార్లమెంటు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఏపీలో రూ. 13,667 కోట్ల‌తో అదానీ ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్‌.. ఎక్క‌డ రానుందంటే?
Recommended image2
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి పండగే... డిసెంబర్ 23 నుండి 27 వరకు స్కూళ్లకు క్రిస్మస్ హాలిడేస్
Recommended image3
AP Panchayat Election Results: ఏపీ పంచాయతీ పోరులో కూటమి దూకుడు. ఎవరెన్ని స్థానాలు గెలిచారంటే?
Related Stories
Recommended image1
New Rules From December 1: గ్యాస్ సిలిండర్ నుంచి ఆధార్ వరకు.. డిసెంబర్ 1 నుంచి 7 కీలక రూల్స్ ఛేంజ్
Recommended image2
Holidays: 2027 ప్రభుత్వ సెలవుల లిస్ట్ వచ్చేసింది.. ఈసారి ఏకంగా 4 లాంగ్ వీకెండ్స్ పండగే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved