అమరావతి: పారిశ్రామిక వేత్త జయరామ్ హత్య కేసులో నిందితుడు రాకేష్‌రెడ్డి పోలీసులు విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఓ యాంకర్‌ ద్వారా జయరామ్‌ను తన ఇంటి వద్దకే పిలిపించానని పోలీసుల విచారణలో రాకేష్‌రెడ్డి చెప్పినట్లు సమాచారం. 

రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించిన విషయాలపై ఓ ప్రముఖ తెలుగు మీడియా సంస్థ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఆ వార్తాకథనం ప్రకారం....డబ్బు విషయంలో తనకూ జయరామ్‌కు మధ్య వివాదం నెలకొందని, తన ఇంటిలోనే జయరామ్‌ను చంపేశానని రాకేష్‌రెడ్డి విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. 
 
శిఖా చౌదరితో గతంలో డేటింగ్‌ చేశానని రాకేష్ రెడ్డి అంగీకరించినట్లు సమాచారం. ఇద్దరి మధ్య సంబంధం వివాహం దాకా వెళ్లిందని, శిఖాచౌదరికి చాలా మందితో సంబంధాలు ఉన్నాయని తనకు తెలిసిందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకుని పెళ్లికి తాను నిరాకరించినట్లు అతను తెలిపినట్లు తెలుస్తోంది. 

హత్యలో శిఖా పాత్ర గురించి రాకేష్‌ను పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. శిఖా చౌదరి ఇంకా పోలీసుల అదుపులోనే ఉంది. రాకేష్‌రెడ్డిని రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో హత్య చేసి మృతదేహాన్ని కృష్ణా జిల్లాలో పడేయడం గురించి పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. జయరామ్‌కు ఫోన్‌ చేసిన యాంకర్‌ను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు