విజయవాడ: ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మెన్  జయరామ్ మృతిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు కారణంగా  పోలీసులు జయరామ్‌ది హత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. జయరామ్‌ కారును వెంబడించిన మరో కారు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

రెండు రోజుల క్రితం హైద్రాబాద్‌ నుండి విజయవాడకు బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మెన్ జయరామ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. విజయవాడకు సమీపంలోని కీసర వద్ద కారులో జయరామ్‌ మృతదేహం శుక్రవారం నాడు లభ్యమైంది.

రెండు రోజులుగా  జయరామ్ ఎక్కడ ఉన్నాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్యకు ముందు జయరామ్ కారును మరో కారు వెంబడించినట్టుగా పోలీసులు గుర్తించారు. సీసీపుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. జయరామ్ హత్య తర్వాత ఆయన కారును వెంబడించిన కారు ఎటు వైపు వెళ్లిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే జయరామ్ మేకోడలు షికా చౌదరి కోసం పోలీసులు హైద్రాబాద్ వెళ్లారు. జయరామ్ కారు నడిపిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడనే విషయమై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం  కీసర పోలీసులు నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేశారు. జయరామ్ మృతిపై అతని మామ గుత్తా పిచ్చయ్య చౌదరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు  జయరామ్ కోడలు షికా చౌదరిని డీఎస్పీ విచారించనున్నారు.

జయరామ్ కుటుంబసభ్యులు, కోస్టల్ బ్యాంకు సిబ్బందిని పోలీసులు  ప్రశ్నించనున్నారు. మరో వైపు జయరామ్ కారు డ్రైవర్ ను పోలీసులు విచారించనున్నారు. ఇదిలా ఉంటే జయరామ్ మృతదేహం హైద్రాబాద్ కు తరలించారు. 

పర్సనల్ డ్రైవర్‌తో పాటు ఆయనకు గన్‌మెన్ కూడ ఉన్నారు. అయితే గన్‌మెన్ ,డ్రైవర్ లేకుండా ఆయనకు ఎక్కడికి వెళ్లారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.జయరామ్ మేనకోడలు షికా చౌదరిని పోలీసులు హైద్రాబాద్ కు తరలించారు. జయరామ్‌తో పాటు కారులో మరో ముగ్గురు వ్యక్తులు ప్రయాణించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు