ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేత చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. కారులో వెనుకసీటులో ఆయన పడివుండటం, ముఖంపై గాయాలు ఉండటంతో పోలీసులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు.

మరోవైపు నిమిషాల వ్యవధిలోనే ఆయన మృతదేహం నల్లగా మారిపోతుండటంతో జయరామ్‌‌పై విషప్రయోగం చేసివుంటారని ఖాకీలు అనుమానిస్తున్నారు. టోల్‌గేట్‌ల వద్ద సేకరించిన సీసీటీవీ ఫుటేజ్‌లలో కారును తెలుపు రంగు చొక్కా వేసుకున్న వ్యక్తి నడిపినట్లు తెలుస్తోంది.

తలమీద గాయాలను బట్టి ముందు దాడి చేసి తర్వాత హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. కారులో ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ఘటన జరిగింది. 

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు