హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త  జయరాం బలహీనతలను తెలుసుకొన్న రాకేష్ రెడ్డి... ఆ బలహీనతనే ఎరగా వేసి తన వద్దకు  ఆయన వచ్చేలా ప్లాన్ చేశారు. రీనా అనే అమ్మాయి పేరుతో జయరామ్‌తో రాకేష్ రెడ్డి చాటింగ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఎవరూ లేకుండా ఒంటరిగా రావాలని జయరామ్‌తో  రాకేష్ రెడ్డి చేసిన చాటింగ్‌ను నమ్మి వెళ్లిన ఆయన ప్రాణాలను పోగోట్టుకొన్నారు.

 గత నెల 30వ తేదీన రాకేష్ రెడ్డి పన్నిన వలలో జయరామ్ చిక్కుకొన్నారు. తన వద్ద తీసుకొన్న నాలుగున్నర కోట్ల రూపాయాల అప్పును చెల్లించకుండా జయరామ్ తప్పించుకొని తిరుగుతున్నారని రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం.

రాకేష్ రెడ్డి  పోన్లు చేస్తే జయరామ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. తన డబ్బులను రాబట్టుకొనేందుకు రాకేష్ రెడ్డగి పక్కా స్కెచ్ వేశాడు.  జయరామ్‌కు రీనా అనే అమ్మాయి పేరుతో వల వేశాడు. జయరామ్ నెంబర్‌కు రీనా పేరుతో చాటింగ్ చేసేవాడు.

వాట్సాప్ డీపీలో అందమైన అమ్మాయి ఫోటో పెట్టాడు.  జయరామ్ బలహీనతను తెలుసుకొన్న రాకేష్ రెడ్డి  తెలివిగా గత నెల 30వ తేదీన ఇంట్లో తాను ఒంటరిగా ఉన్నాను.. రావాలంటూ చాటింగ్ చేశారు.

అయితే డ్రైవర్ లేకుండా ఒంటరిగా రావాలని  జయరామ్ కు కండిషన్ పెట్టాడు. ఆ కండీషన్ ప్రకారంగానే జయరామ్  రాకేష్ రెడ్డి ఇంటికి వచ్చాడు. రీనా అనే మహిళగా భ్రమించి జయరామ్ ఆ ఇంటికి వెళ్లాడు.

అయితే అదే సమయంలో  ఆ ఇంటికి వెళ్లిన  జయరామ్‌ షాక్ కు గురయ్యాడు.  రీనా కోసం వెళ్లిన జయరామ్ కు రాకేష్ రెడ్డి కన్పించాడు. రాకేష్ రెడ్డి మనుషులు బలవంతంగా జయరామ్ ను ఇంట్లోకి తీసుకెళ్లారు.

30వ తేదీ రాత్రి జయరామ్‌ను రాకేష్ రెడ్డి బంధించారు.  తన డబ్బుల కోసం రాకేష్ రెడ్డి ఒత్తిడి చేశాడు.  శిఖా చౌదరిని జయరామ్ రూ. 10 లక్షలు ఇవ్వాలని అడిగాడు. అయితే తన వద్ద డబ్బులు లేవని  ఆమె తేల్చి చెప్పింది.

కోస్టల్ బ్యాంకులో పనిచేసిన ఓ మహిళకు కూడ జయరామ్ ఫోన్ చేశాడు.  ఆ తర్వాత అదే బ్యాంకులో పనిచేసిన ఈశ్వర ప్రసాద్ కు కూడ జయరామ్ ఫోన్ చేశారు.  ఈశ్వర ప్రసాద్  గత నెల 31వ తేదీన రూ. 6 లక్షలను ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

గత చరిత్ర: హీరోయిన్‌ వ్యభిచారం కేసులో పట్టుబడిన రాకేష్ రెడ్డి

శిఖా చౌదరి అదుపులో లేదు, ఆ ఫోటో నిజం కాదు: డిఎస్పీ

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?