ఆమెకు మగవాళ్ల మీదకన్నా.... ఆడవాళ్లపై మోజు ఎక్కువ. తన గొంతు మార్చి మగవారిలో మాట్లాడగలదు. అదే టాలెంట్ తో ఫోన్లో అమ్మాయిలను ట్రాప్ చేసేది. ఆ తర్వాత వాళ్లను తన దగ్గరకు రప్పించుకొని... శృంగారంలో పాల్గొనేది.  సెక్స్ టాయ్స్ తో ఇతర స్త్రీలతో శృంగారంలో పాల్గొనేది.. ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. వాడి సహాయంతో... అమ్మాయిలను ట్రాప్ చేసి.. వారికి నరకం చూపించేది. కాగా... ఆమె వలలో పడి నరకం చూసిన ఓ బాలిక ఫిర్యాదుతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోనే చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు కి చెందిన సుమలత అలియాస్ సాయితేజా రెడ్డి. ఆమెకు పెళ్లైంది. కానీ కొంత కాలం తర్వాత భర్తను వదిలేసి అతనికి దూరంగా ఉంటోంది. భార్యను వదిలేసిన ఏడుకొండలు అనే వ్యక్తితో ఏడేళ్లుగా సహజీవనం చేస్తోంది. మూడు నెలల క్రితం ఒంగోలులోని మారుతీనగర్ లో ఇల్లు అద్దెకు తీసుకొని వారు అక్కడ ఉంటున్నారు.

అక్కడ సిమ్‌కార్డులు విక్రయించే వంశీ అనే యువకుడికి సుమలత, ఏడుకొండలుతో పరిచయం ఏర్పడింది. సిమ్‌కార్డుల కోసం వంశీ వద్దకు వచ్చే యువతుల ఫోన్‌ నంబర్లను సుమలతకు ఏడుకొండలు అందజేసేవాడు. సుమలత వారితో సాయితేజా రెడ్డి పేరుతో మాట్లాడి ట్రాప్‌ చేసేది. అమ్మాయిలపై సుమలతనే కాదు. ఏడుకొండలు, వంశీ కూడా అత్యాచారం చేసేవారు. పెళ్లి కాని యువతులు, కాలేజీ విద్యార్థినులు, బాలికలను లక్ష్యంగా చేసుకొని సుమలత అకృత్యాలకు పాల్పడింది. అవమాన భారంతో వారంతా మౌనంగా ఉండిపోయారు.

కాగా... ఓ బాలిక వారి వలలో చిక్కుకొని రెండు రోజులపాటు నరకం అనుభవించింది. వారి వద్ద నుంచి తప్పించుకున్న బాలిక... పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ముందుగా సుమలత ప్రియుడు ఏడుకొండలను పట్టుకున్నారు. దాదాపు ఏడేళ్ల పాటు వాళ్లు చేస్తున్న అకృత్యాలు బయటపడటంతో.. ఏడుకొండలు దానిని అవమానంగా భావించాడు. దీంతో.. మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా సుమలత, వంశీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.