Pawan Kalyan: సనాతన ధర్మంపై దాడి చేస్తే .. పవన్ మాస్ వార్నింగ్ - తిరుపతి వారాహి సభ డిక్లరేషన్ ఇదే
Pawan Kalyan: ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలుగా, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలనీ, ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
Pawan Kalyan: ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలుగా, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలనీ, ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
గురువారం సాయంత్రం తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ .. సనాతన ధర్మంపై దాడి చేస్తే ఊరుకునేది లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తిరుమల తిరుపతి వెంకన్నసన్నిధిలో అపచారం జరిగితే మాట్లాడకుండా చూస్తూ ఉంటామా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మంపై దాడి చేసే వారికి ఈ సభ నుంచి పవన్ హెచ్చరకలు జారీ చేశారు. ఈ క్రమంలోనే తిరుపతి వారాహి సభలో సనాతన ధర్మ రక్షణ కోసం డిక్లరేషన్ ను ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ తిరుపతి సభ - సనాతన ధర్మ రక్షణ కోసం 'వారాహి డిక్లరేషన్' లో ఏముంది?
1) ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి.
2) సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలు అయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దాన్ని తక్షణమే తీసుకురావాలి.
3) సనాతర ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ ఏర్పాటు కావాలి.
4) సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి.
5) సనాతన ధర్మాన్ని కించపరచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి.
6) ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి.
7) ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి.
సనాతన ధర్మం రక్షణ కోసం బలమైన చట్టం తేవాలి : పవన్ కళ్యాణ్
హిందూ సనాతన ధర్మాన్ని, ఇతర అన్ని విశ్వాసాలను ఒకే పద్ధతిలో రక్షించడానికి బలమైన జాతీయ చట్టాన్ని రూపొందించాలని పవన్ కళ్యాణ్ కోరారు. సనాతన ధర్మాన్ని రక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఇతర మతాల విశ్వాసాలను, ధర్మాలను కూడా గౌరవించేలా నిలబడాలని పిలుపునిచ్చారు. "సగటు భారతీయుడిగా నా సనాతన ధర్మాన్ని.. నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను. ఇస్లాం, క్రిస్టియన్, సిక్కుమతం, బౌద్ద మతాన్ని మొదలైన అన్యమతాలను గుండెల నిండుగా గౌరవిస్తాను" అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అంతకుముందు పవన్.. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థనలు చేశారు. తిరుపతి లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ వివాదం నేపథ్యంలో పవన్ ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత, ఆయన తన 'వారాహి' ప్రచార వాహనంపై జ్యోతిరావు ఫూలే సర్కిల్‌కు చేరుకున్నారు. అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో వారాహి డిక్లరేషన్ ను ప్రకటించారు.
సనాతన ధర్మం-కోర్టులపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కోర్టులు, సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.సనాతారా ధర్మాన్ని పరిరక్షించడానికి తాను పోరాటం చేస్తాననీ, ఈ విషయంలో రోడ్లపైకి రావడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని అన్నారు. ఎన్నో దశాబ్దాలుగా చూస్తున్న ప్రధాన విషయం ఏమిటంటే సనాతన ధర్మాన్ని అనుసరించే వారిపై చట్టాలు కఠినంగా ఉన్నాయని అన్నారు. ఇతర మతాల వారిపై మానవత్వం, జాలి చూపిస్తూ హిందూ ధర్మంపై కఠినత్వం ఎందుకని ప్రశ్నించారు.
"ఏకత్వాన్ని చూపించేది సనాతన ధర్మం, ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మం. సనాతన ధర్మం కేవలం మనుషులు ఒక్కరే బాగుండాలని కోరుకోలేదు. ఈ భూ ప్రపంచం మీదున్న అన్ని జీవజాతులు బాగుండాలని కోరుకుంటుంది. వసుదైవక కుటుంబం.. అన్ని జాతులు, అన్ని పక్షులు, పశువులు, అన్ని ప్రాంతాలు, అన్ని దేశాలు ఇలా అందరూ బాగుండాలని కోరుకునేది సనాతన ధర్మం" అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని దుర్వినియోగం చేసేవారినీ, సనాతన ధర్మంపై దాడి చేసేవారిని కోర్టులు కాపాడుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం’ అని ఓ యువ నాయకుడి ప్రకటనను కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే దేశంలోని అన్ని కోర్టులు స్పందించి వారిని నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయని ఆయన అన్నారు. సనాతన ధర్మాన్ని అవమానించే వారిపై మాట్లాడేందుకు కోర్టులు భయపడుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి వారాహి బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారం ఇదిగో