MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • రజనీకాంత్‌ని పిచ్చోడిగా వర్ణించిన మీడియా, చిరంజీవితో కూడా గొడవ.. నాగబాబు చెప్పిన నిజాలు

రజనీకాంత్‌ని పిచ్చోడిగా వర్ణించిన మీడియా, చిరంజీవితో కూడా గొడవ.. నాగబాబు చెప్పిన నిజాలు

రజనీకాంత్‌ తిరుగులేని సూపర్ స్టార్‌గా రాణిస్తున్నారు. అయితే ఆయన్ని మీడియా టార్గెట్‌ చేసిందట. పిచ్చోడిగా చిత్రీకరించిందట. నాగబాబు సంచలన విషయాలు బయటపెట్టారు.   

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 27 2024, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rajinikanth

Rajinikanth

 రజనీకాంత్‌ ప్రస్తుతం సౌత్‌లోనే సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌ ఇప్పుడు ఊపందుకుంది. కానీ దాన్ని ఇరవై ఏళ్ల క్రితమే చేసి చూపించారు. `శివాజీ`, `రోబో`తోనే ఇండియన్‌ సినిమాని షేక్‌ చేశాడు రజనీకాంత్‌. స్టయిల్‌తోనే బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించాడు. ఇప్పటికీ చాలా కంపెనీలు రజనీకాంత్‌ సినిమా విడుదలవుతుందంటే ఏకంగా హాలీడే ప్రకటిస్తుంటాయి. అది రజనీ క్రేజ్‌. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Rajinikanth

Rajinikanth

బస్‌ కండక్టర్‌ నుంచి నటుడిగా మారి, చిన్న చిన్న పాత్రలు చేస్తూ, నెగటివ్‌ రోల్స్ చేస్తూ నటుడిగా ఎదిగారు రజనీకాంత్‌. ఆ తర్వాత హీరోగా టర్న్‌ తీసుకున్నారు. నెమ్మదిగా హిట్లు అందుకుంటూ తానేంటో నిరూపించుకున్నారు. హీరోగా, స్టార్‌ హీరోగా, సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. తన సమకాలీకుడు, తనకంటే ముందు వచ్చిన కమల్‌ హాసన్‌కి పోటీగా ఎదిగాడు. ఇంకా చెప్పాలంటే కమర్షియల్‌ యాంగిల్‌లో, మాస్‌ ఇమేజ్‌ కోణంలో కమల్‌ని మించి ఎదిగాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

36
Rajinikanth, Vettaiyan, OTT release date

Rajinikanth, Vettaiyan, OTT release date

అయితే రజనీకాంత్‌ ఇప్పుడు చాలా సౌమ్యంగా, కూల్‌గా, కామ్‌గా ఉన్నారు. ఆథ్యాత్మిక విషయాలకు ప్రయారిటీ ఇస్తారు. ఎక్కువగా యోగా, ధ్యానం చేస్తుంటారు. ప్రతి ఏడాది హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేస్తుంటారు రజనీకాంత్‌. మానసికంగా ఆయన చాలా దృఢంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో అనేక అనారోగ్య సమస్యలను కూడా ఫేస్‌ చేసి నిలబడ్డాడు. 

46

ఇప్పుడు కూల్‌గా కనిపించే రజనీ ప్రారంభంలో మాత్రం చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడట. నటుడిగా గుర్తింపు వస్తున్న సమయంలో, హీరోగా నిలబడుతున్న సమయంలోనే చాలా కోపంతో కనిపించేవాడట. ఓ సందర్భంలో చిరంజీవితో కూడా గొడవ పడ్డాడట. ఏదో విషయంలో ఇద్దరు వాగ్వాదానికి కూడా దిగారట.

చాలా హీటెడ్‌ ఆర్గ్యూమెంట్‌ జరిగిందని, ఆ తర్వాత మళ్లీ అది సెట్‌ అయ్యింది. ఇద్దరు మంచి స్నేహితులు కూడా అయ్యారని తెలిపారు మెగా బ్రదర్‌ నాగబాబు. తన ఎన్‌ మీడియా యూట్యూబ్‌ చానెల్‌లో ఈ విషయం వెల్లడించారు. రజనీకాంత్‌ జర్నీని వివరించే ప్రయత్నం చేశారు. 
 

56

ఈ సందర్భంగానే ఓ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు నాగబాబు. అప్పట్లో రజనీకాంత్‌ సినిమా గురించి ఓ మీడియా రిపోర్టర్‌ నెగటివ్‌గా రాశాడట. అది చూసి తట్టుకోలేకపోయిన రజనీకాంత్‌.. ఓ రిపోర్టర్‌ని కూడా కొట్టాడట. ఈ విషయాన్ని నాగబాబు వెల్లడించారు. అప్పట్లో మీడియా రిపోర్టర్‌పై చేయిచేసుకోవడం వల్ల మీడియా అంతా కక్ష్య కట్టారని, వరుసగా నెగటివ్‌గా ఆర్టికల్స్ రాశారని తెలిపారు.

రజనీకాంత్‌ని పిచ్చోడిగానూ వర్ణించారట. ఆయనకు పిచ్చి ఉందని, ప్రతి నెల టాబ్లెట్లు కూడా వాడుతుంటాడని కూడా రాశారట. ఆ సమయంలో చాలా స్ట్రగుల్ ఫేస్‌ చేశాడట రజనీకాంత్‌. ఇలా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నారు రజనీకాంత్ అని తెలిపారు నాగబాబు. 
 

66

రజనీకాంత్‌ తనకు పర్సనల్‌గా ఎంతో ఇష్టం అని, చిరంజీవి పెద్ద కూతురు పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్‌కార్డ్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు రజనీకాంత్‌ కాళ్లు మొక్కినట్టు తెలిపారు నాగబాబు. అంతటి అభిమానం ఆయనంటే. ఆ సమయంలోనే `బాబా` సినిమా గురించి చెప్పాడట. తను చాలా సంతోషించినట్టు తెలిపారు నాగాబు.

అయితే మళ్లీ చాలా ఏళ్ల తర్వాత `జైలర్‌`లో ఓ సీన్‌లో కలిసి నటించానని, ఆ పాత్రని రజనీకాంత్‌ నే సజెస్ట్ చేశాడట. ఈ పాత్రకి నాగబాబు సూట్‌ అవుతాడని చెప్పి ఆయనే రికమండ్‌ చేశాడట. అది తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు నాగబాబు.  
 

read more: 23 హిట్స్ ఇచ్చిన దర్శకుడినే అవమానించిన చిరంజీవి.. బహిరంగంగానే సెటైర్లు వేసిన స్టార్‌ డైరెక్టర్

also read: పారితోషికం సగం కట్‌ చేశాడు, మామ నాగార్జునపై సుమంత్‌ కంప్లెయింట్‌.. మొదటి రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image2
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image3
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved