Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రాన్ని తగులబెడుతారా, శివాజీ చెప్పినట్లే జరిగింది: జగన్ మీద దాడిపై బాబు

మీ పార్టీకి చెందిన వ్యక్తే  జగన్ పై  దాడికి పాల్పడడం సిగ్గుచేటని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వైసీపీ‌పై విమర్శలు గుప్పించారు

Chandrababunaidu sensational comments on jagan attack
Author
Amaravathi, First Published Oct 25, 2018, 9:26 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


అమరావతి:  మీ పార్టీకి చెందిన వ్యక్తే  జగన్ పై  దాడికి పాల్పడడం సిగ్గుచేటని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వైసీపీ‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య  సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఆఘమేఘాల మీద కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ నేతలు ఈ ఘటనను ఖండించారని బాబు దుయ్యబట్టారు. ఏపీ ప్రజలంటే ఎందుకంత కోపమని ప్రశ్నించారు. 

విశాఖ విమానాశ్రయంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై  జరిగిన దాడిని గురువారం నాడు రాత్రి అమరావతిలో మీడియాతో మాట్లాడారు. విశాఖ ఎయిర్‌పోర్ట్ సీఐఎస్ఎఫ్ ఆధీనంలో ఉంటుందన్నారు.  ఎయిర్‌పోర్ట్ లోపల జరిగితే రాష్ట్ర ప్రభుత్వానిదా బాధ్యత అని ప్రశ్నించారు. 

విశాఖలో దాడి జరిగిన తర్వాత జగన్ బాధ్యతరాహితంగా వ్యవహరించాడన్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ చీఫ్  వైఎస్ జగన్  ‌పై దాడి ఘటనపై ఏపీ డీజీపీకి గవర్నర్ ఫోన్ చేసి నివేదిక అడుగుతారా అని ఆయన ప్రశ్నించారు. తాను కూడ చాలా కాలం పాటు సీఎంగా ఉన్నానని ఆయన గుర్తు చేశారు.బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు  పెద్ద హీరోలా మాట్లాడుతారా అని ఆయన ప్రశ్నించారు.

గతంలో హీరో శివాజీ ఆపరేషన్ గరుడలో భాగంగా విపక్షనేతపై హత్యాయత్నం జరుగుతుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.ఈ రాష్ట్రాన్ని తగులబెట్టాలని భావిస్తున్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు. 

విశాఖలో, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో  చికిత్స చేసుకొని.. ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత జగన్  మళ్లీ ఆసుపత్రికి వెళ్లి డ్రామాలు చేస్తున్నారని  జగన్ పై  చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకొంటే  చూస్తూ ఊరుకోమన్నారు.  ప్రతి వారం పూట కోర్టులకు హాజరు కాకుండా ఉండేందుకు మినహాయింపు  కోరుకొనేందుకు గాను జగన్ ఈ డ్రామాలను చేస్తున్నారని ఆయన  ఆరోపించారు.తిత్లీ తుఫాన్ వస్తే కనీసం మాట్లాడని కేసీఆర్, కేటీఆర్, కవిత ఆఘమేఘాల మీద జగన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఏపీ ప్రజలపై కేసీఆర్ కు ఎందుకంత కోపమన్నారు. బిజెపి, పవన్, జగన్ లతో కేసిఆర్ కూడా కలిశారని ఆయన అన్నారు.

విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిలో జగన్‌కు తగిలిన గాయం చాలా చిన్నదేనని చంద్రబాబు అన్నారు. దాడి ఘటన గురించి విశాఖ వైద్యులు ఇచ్చిన రిపోర్టును ఆయన చదివి విన్పించారు. అర అంగుళం మేర గాయమైందని డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులో స్పష్టంగా ఉందని అన్నారు. 

దాడి నెపంతో రేపు కోర్టుకు హాజరుకాకూడదని జగన్‌ నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో అస్థిరత్వం సృష్టించి అరాచకాలు చేయాలనుకుంటున్నారని ఆయన అన్నారు. ఆస్పత్రిలో జగన్ చాలా పాథటెక్ గా పడుకున్నాడని, ఫొటో చూశారా అని అడిగారు. గాయపడిన జగన్ ను విమానం సిబ్బంది లోనికి అనుమతించడం కూడా తప్పేనని ఆయన అన్నారు. 

 

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి:సీఎం కాలేదని మనస్తాపం, అందుకే..: శ్రీనివాసరావు

జగన్ అభిమాని, అలా ఎందుకు చేశాడో: శ్రీనివాస్ తల్లిదండ్రులు

జగన్‌కు కేసీఆర్ ఫోన్: దాడి వివరాలను తెలుసుకొన్న సీఎం

జగన్ మెడపై కత్తి దిగేదే, అయితే....: ప్రత్యక్షసాక్షి

జగన్‌పై వెయిటర్ దాడి: ట్విస్టిచ్చిన చంద్రబాబు

జగన్‌ పై దాడి: డీజీపీ వ్యాఖ్యలు దారుణం: అంబటి రాంబాబు

జగన్‌‌‌ను పరామర్శించిన జానారెడ్డి

మాకు సంబంధం లేదు, ఖండిస్తున్నా: జగన్‌ మీద దాడిపై చంద్రబాబు

పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

 

Follow Us:
Download App:
  • android
  • ios