విశాఖపట్నం: విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి జరిగడంతో లోటస్ పాండ్ లోని జగన్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి లోటస్ పాండ్ లో కుప్పకూలిపోయారు. అటు పార్టీ నేతలు సైతం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 
 
విజయమ్మ, వైఎస్ భారతీలు కన్నీరుమున్నీరుగా వినిపిస్తున్నారు. అటు వైఎస్ జగన్ శుక్రవారం కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో పాదయాత్రకు విరామం చెప్పి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లాంజ్ లో వెయిట్ చేస్తున్న జగన్ ను వెయిటర్ శ్రీనివాస్ టీ ఇస్తూ పలకరించాడు. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో 160 సీట్లు వస్తాయా సార్ అంటూ పలకరించాడు. సెల్ఫీ దిగుతాను సార్ అంటూ చెప్పి తాను వెంట తెచ్చుకున్న కత్తితో జగన్ భుజంపై దాడి చేశాడు.

దీంతో గాయాలపాలైన జగన్ కు ఎయిర్ పోర్ట్ లోని వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. ప్రథమ చికిత్స అనంతరం జగన్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయలుదేరారు. జగన్ హైదరాబాద్ వస్తున్నారని విషయం తెలుసుకోవడంతో బంధువులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున లోటస్ పాండ్ కు చేరుకున్నారు.  

అయితే నిందితుడు వెయిటర్ శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీనివాస్ ఎందుకు దాడి చేశాడు..దాడి వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)