అమరావతి: ప్రచారం కోసమే వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి జరిగిందని  డీజీపీ ఠాకూర్  చెప్పడం దారుణమని  వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. ఏపీ పోలీసుల విచారణపై నమ్మకం లేదన్నారు. సీబీఐ విచారణ జరిపించాలని  ఆయన డిమాండ్ చేశారు. 

వైసీపీ ప్రధాన కార్యాలయంలో గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పై దాడి చేసిన కత్తి చాలా పదునైందన్నారు. పాపులారిటీ కోసమే ఈ దాడి జరిగిందని డీజీపీ చెప్పడంతో ఈ ఘటన వెనుక వాస్తవాలు బయటకు వస్తాయా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

జగన్‌ మెడపై కత్తితో దాడి చేసేందుకు నిందితుడు  ప్రయత్నించాడన్నారు.మెడలో కత్తి దిగితే ప్రమాదం జరిగేదన్నారు. కానీ, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం కోసమేఈ దాడి  జరిగిందని  ప్రచారం చేయడం వెనుక దర్యాప్తు ఎలా సాగుతోందో అర్ధం చేసుకోవచ్చన్నారు.

శ్రీనివాస్ వైసీపీ అభిమాని అంటూ చెబుతున్నారు. కానీ, శ్రీనివాస్ పనిచేస్తున్న రెస్టారెంట్ యజమాని  ఎవరు... ఏ పార్టీకి చెందినవాడు అనే విషయమై ఎందుకు పోలీసులు, మంత్రులు మాట్లాడడం లేదని   అంబటి రాంబాబు  ప్రశ్నించారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  చంద్రబాబునాయుడుపై మావోలు దాడి చేసిన సమయంలో అప్పటి విపక్షనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి  తిరుపతిలో ధర్నా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దాడి వెనుక వాస్తవాలను  తెలుసుకొనే ప్రయత్నం చేయాలన్నారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌ రాష్ట్ర పరిదిలో ఉండదని మంత్రులు చెబుతున్నారని.. గత ఏడాది జనవరి 26వ తేదీన జగన్ తో పాటు  వైసీపీ నేతలను ఆనాటి విశాఖ సీపీ  ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చి అరెస్ట్ చేసిన  విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియకముందే  మంత్రులు ఇలా మాట్లాడడం వల్ల దర్యాప్తు ఏ రకంగా సాగనుందో అర్ధమౌతోందన్నారు.ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని  ఆయన కోరారు. 

ఆపరేషన్ గరుడలో  భాగంగానే  ఇలా జరిగిందని... ఇదివరకే ఈ విషయాన్ని సినీ నటుడు శివాజీ ప్రకటించారని  మీడియా ప్రతినిధులు గుర్తు చేయగా... జరగబోయే విషయాలను  ముందే  తెలిసిన శివాజీని అరెస్ట్ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

జగన్‌‌‌ను పరామర్శించిన జానారెడ్డి

మాకు సంబంధం లేదు, ఖండిస్తున్నా: జగన్‌ మీద దాడిపై చంద్రబాబు

పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు