విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)
విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. విమానాశ్రయం లాంజ్ లో కూర్చుని ఉండగా ఆయనపై గురువారం దాడి జరిగినట్లు తెలుస్తోంది.
విశాఖపట్నం: విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. విమానాశ్రయం విఐపి లాంజ్ లో కూర్చుని ఉండగా ఆయనపై గురువారం దాడి జరిగింది. శ్రీనివాస రావు అనే వెయిటర్ కోడి పందేలకు వాడే కత్తితో ఆయనపై దాడి చేశాడు..
దాడి చేసిన వెయిటర్ శ్రీనివాస్ ను విమానాశ్రయం భద్రతా సిబ్బంది పట్టుకుని సిఎస్ఎఫ్ఐకి అప్పగించారు. హైదరాబాదు రావడానికి జగన్ విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. ఈ సమయంలో ఆయనపై దాడి జరిగింది.
జగన్ ఎడమ భుజంపై స్వల్పంగా గాయమైంది. శ్రీనివాస్ ఎందుకు దాడికి ప్రయత్నించాడనేది తెలియదు. విమాశ్రయంలో జగన్ కు ప్రాథమిక చికిత్స చేశారు. సెల్ఫీ తీసుకుంటానని దగ్గరకు వచ్చి శ్రీనివాస రావు జగన్ పై దాడి చేశాడు. విమానాశ్రయంలోని క్యాంటిన్ లో అతను పనిచేస్తున్నట్లు తేలింది. అతని చేత ఎవరైనా ఆ దాడి చేయించారా అనేది కూడా తెలియాల్సి ఉంది.
"
వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి
160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి
విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)
విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి
జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు
వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి
160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి
విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)
విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి
జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు