ముమ్మిడివరం: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌‌‌పై దాడికి పాల్పడిన శ్రీనివాస్ చాలా మంచోడని... జగన్ కు వీరాభిమాని గా ఉన్న తన సోదరుడు  ఈ దాడి చేశాడంటే నమ్మశ్యక్యంగా లేదని  సుబ్బరాజు చెప్పారు.

వైఎస్ జగన్‌పై  శ్రీనివాస్ దాడికి పాల్పడిన ఘటనపై ఓ న్యూస్ ఛానెల్‌తో   సుబ్బరాజు మాట్లాడారు.  తన పనిని తాను చేసుకొంటూ  శ్రీనివాస్ ఉండేవాడని సుబ్బరాజు గుర్తు చేసుకొన్నారు.  గతంలో కూడ శ్రీనివాస్ పై  ఎలాంటి కేసులు లేవన్నారు.

తమ గ్రామంలో  శ్రీనివాస్‌ జగన్ ఫ్లెక్సీని  ఏర్పాటు చేశారని ఆయన ప్రస్తావించారు. జగన్ ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే  ఇల్లు,  ఇతర సంక్షేమ పథకాల గురించి కొందరు టీడీపీ నేతలు తమను ప్రశ్నించారని  సుబ్బరాజు గుర్తు చేసుకొన్నారు. శ్రీనివాస్ అభిమానం వేరు...  తాము వేరని చెప్పినట్టు చెప్పారు.

ఈ ఘటన తెలిసి చాలా బాధపడినట్టు సుబ్బరాజు తెలిపారు.   తన తమ్ముడిని  ఎవరైనా ఉపయోగించి ఉంటారా అనే అనుమానాలను ఆయన ఖండించారు.  హోటల్ లో పని చేసుకొంటూ జీవనం సాగిస్తున్న కుటుంబం తమదన్నారు. 

జగన్‌ అంటే అభిమానమని.... అతనే  జగన్‌పై దాడి చేశాడంటే  తాను నమ్మడం లేదన్నారు. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత రెస్టారెంట్‌ లో శ్రీనివాస్ పనిచేస్తున్నాడని ఆయన గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు