విశాఖపట్టణం:  కుట్ర పూరితంగా  వైఎస్ జగన్ ‌పై  దాడికి పాల్పడితే శ్రీనివాస్‌ను ఉరి తీయాలని.. రెస్టారెంట్ యజమాని  హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. సాటి మనిషిని హత్య చేసే హక్కు ఎవరికీ కూడ లేదన్నారు. 

 తాను ఏనాడూ కోపం, రౌద్రం, శ్రీనివాస్‌లో తాను ఏనాడూ చూడలేదన్నారు.  తమ రెస్టారెంట్ నుండి దాడి జరగలేదన్నారు. వీఐపీ లాంజ్ లో  జగన్ పై దాడి జరిగిందన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.  ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరైనా కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన శ్రీనివాస్ అనే వ్యక్తి  హర్షవర్ధన్ అనే వ్యక్తి రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ గురించిన వివరాలను ఆయన ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  పలు విషయాలను వెల్లడించారు. 

తన రెస్టారెంట్‌లో పనిచేసే శ్రీనివాస్ అనే యువకుడు వైఎస్ జగన్ వీరాభిమాని అని ఆయన గుర్తు చేసుకొన్నారు.  తమ రెస్టారెంట్‌లో పనిచేసే  వారిలో  కుట్రదారులు ఎవరూ కూడ ఉండరని చెప్పారు.

శ్రీనివాస్ ఉపయోగించిన కత్తి తమ రెస్టారెంట్‌లో  ఉపయోగించే కత్తి కాదన్నారు.  తమ రెస్టారెంట్‌లో ఉపయోగించే కత్తులకు కోడ్ ఉంటుందన్నారు.  ఈ రకమైన కత్తులను  తమ రెస్టారెంట్‌లో ఉపయోగించమని చెప్పారు.

వైఎస్ జగన్  అభిమాని శ్రీనివాస్  ఆయనపై ఎందుకు దాడి చేస్తారో అర్థం కాలేదన్నారు.  రెస్టారెంట్ నుండి కాకుండా ఇతరులు ఎవరైనా శ్రీనివాస్ కు అందించి ఉండొచ్చని ఆయన  అనుమానం వ్యక్తం చేశారు.

వైసీపీ చీఫ్ జగన్‌పై దాడి కుట్రలో భాగమే అయి ఉండొచ్చని హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు.పదునైన ఆయుధాలను ఎయిర్‌పోర్ట్‌లోకి ఎలా వచ్చిందనే విషయమై  పోలీసులు ఆరా తీయాలన్నారు.

తమ వద్ద పనిచేసే సమయంలో కూడ కస్టమర్లతో పాటు ఇతరులతో కూడ అసభ్యంగా, అమర్యాదగా ఏనాడూ కూడ  ప్రవర్తించలేదన్నారు. శ్రీనివాస్  మంచి ప్రవర్తన కలిగిన వాడని చెప్పారు.

శ్రీనివాస్‌ను విచారణ చేసే సమయంలో మీడియా ఉండాల్సిన అవసరం ఉందని హర్షవర్ధన్  కోరారు. 8 మాసాలుగా  తమ రెస్టారెంట్‌లో శ్రీనివాస్  పనిచేస్తున్నాడని ఆయన తెలిపారు. 

2014లో తాను గాజువాకలో  టీడీపీ టిక్కెట్టు ఆశించినట్టు చెప్పారు. కానీ తనకు టిక్కెట్టు దక్కలేదన్నారు. కానీ, ఆ తర్వాత  టీడీపీ రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. కానీ, టీడీపీ సభ్యత్వం మాత్రమే తనకు ఉందన్నారు.  తాను హేయమైన చర్యలకు పాల్పడడని చెప్పారు. 


సంబంధిత వార్తలు

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు