జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడిపై.. ఆ పార్టీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె... జగన్ ప్రాణాలకు ప్రాణహానీ ఉందన్నారు. 

Roja Comments against Attack on YS Jagan

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడిపై.. ఆ పార్టీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె... జగన్ ప్రాణాలకు ప్రాణహానీ ఉందన్నారు.

ఆయనపై దాడి జరిపేందుకు ఉపయోగించిన కత్తికి విషం పూశారేమోనని ఆమె అభిప్రాయపడ్డారు. అత్యంత భద్రత కలిగిన ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ లేదు అనడానికి ఇదొక నిదర్శనమని రోజా ఆరోపించారు. ప్రతిపక్షనేతకే భద్రత నేతకు భద్రత లేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటని రోజా ప్రశ్నించారు.

అక్కడుంది లోకల్ పోలీసులు కాబట్టి మాకేం సంబంధం లేదని ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. గతంలో ప్రత్యేకహోదా ఉద్యమంలో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన జగన్‌ను రన్‌వేపైనే అరెస్ట్ చేశారని రోజా గుర్తు చేశారు.

ఈ రోజు జగన్‌పై హత్యాయత్నం జరిగిందని దీనికి బాధ్యులైన వారిపైనా..నిందితుడి వెనకున్న వ్యక్తిపైన చర్యలు తీసుకోవాలని.. వారి వివరాలు వెల్లడించాలని రోజా ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. 

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios