విశాఖపట్నం: హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ చిన్నల్లుడు ఏపీ ప్రభుత్వానికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. తమకు సీఆర్డీఏ పరిధిలో భూములు ఉన్నాయని తమపై వైసీపీ చేసిన ఆరోపణలు నిజమని తేలితే ఆ 493 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చేస్తామంటూ హామీ ఇచ్చేశారు. 

ఇటీవల రాజధాని అమరావతిలో బాలకృష్ణ వియ్యంకుడు బీఎస్ రామారావుకు 493 ఎకరాల భూమిని చంద్రబాబు కట్టబెట్టారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ మరోసారి ఘాటుగా స్పందించారు. 

సీఆర్డీఏ పరిధిలోని జయంతిపురం భూములపై ఎలాంటి నిర్ణయానికి అయినా తాను సిద్ధమేనంటూ సవాల్ విసిరారు. జయంతిపురంలో తమ పేరిట 493 ఎకరాలు ఉన్నాయంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు నిజమని నిరూపించాలని డిమాండ్ చేశారు. 

బొత్స సత్యనారాయణ ఆరోపించినట్లు ఆ భూములు తమ ఆధీనంలో ఉన్నాయని నిరూపించాలని సవాల్ విసిరారు. ఆ భూములు తమ ఆధీనంలో ఉన్నాయని తేలితే ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు శ్రీభరత్.  

ఇకపోతే ఇటీవలే అమరావతి భూముల్లో చంద్రబాబు నాయుడు బినామీలు, బంధువులు పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారంటూ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. బాలకృష్ణ వియ్యంకుడికి చంద్రబాబు 493 ఎకరాల భూమిని ఏపీఐఐసీ కింద ఎకరం లక్ష రూపాయలకే కారు చౌకగా కట్టబెట్టేశారని ఆరోపించారు. 

తిరిగి ఆ భూములను సీఆర్డీఏ పరిధిలోకి తీసుకువచ్చారని ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని ఆరోపించారు. సీఆర్డీఏ పరిధి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడర్ జరిగిందనడానికి ఇలాంటి ఉదాహరణలే నిదర్శనమన్నారు.   

ఈ వార్తలు కూడా చదవండి

అమరావతి భూములపై బొత్స ఆరోపణలు: బాలయ్య చిన్నల్లుడు భరత్ క్లారిటీ

అమరావతిలో భూములు లేవు.. ఆధారాలుంటే కేసులు పెట్టుకోండి: సుజనా చౌదరి

అంతా గందరగోళంగా ఉంది.. వెయిట్ అండ్ సీ: అమరావతిపై బొత్స వ్యాఖ్యలు

అమరావతిపై సీఎం సమీక్ష: ఉంచుతారా....?తరలించేస్తారా...? జగన్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

ముంపు చూపిస్తే మూడున్నరెకరాలు రాసిస్తా: బొత్సకు మహిళా రైతు సవాల్

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...