కశ్మీర్‌లో తెలుగు విద్యార్ధుల అవస్థలు: మరికొన్ని వార్తలు

By rajesh yFirst Published Aug 3, 2019, 5:38 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
 

బీజేపీలోకి చిరంజీవి... పవన్ తో డీల్ కుదిరిందా?

చిరంజీవిని  బీజేపీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారనే వాదనలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా... బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి.

 

నిమ్మగడ్డ ప్రసాద్ కి బెయిల్ మంజూరు

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ ణు ఐరోపా దేశమైన సెర్బియా పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఆయన విహారయాత్రకు అని అక్కడికి వెళ్లగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

మీ తుగ్లక్ చర్య వల్లే పోలవరం ఇలా... వైసీపీపై లోకేష్ విసుర్లు

ఈ పోలవరం విషయాన్ని ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రస్తావించగా.. కేంద్ర మంత్రి స్పందించి.. అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా టెండర్లు మార్చడం వల్ల పోలవరం ఖర్చు ఎక్కువ అవుతుందని కూడా పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోకేష్... జగన్ ప్రభుత్వానిది తుగ్లక్ చర్యగా పేర్కొంటూ విమర్శలు చేయడం గమనార్హం.

 

గోదావరి ఉగ్రరూపం: మునిగిన పోలవరం స్పిల్‌వే, జలదిగ్బంధంలో 400 గ్రామాలు

తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద కారణంగా పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే పూర్తిగా మునిగిపోయింది. స్పిల్ వే మీదుగా 2 మీటర్ల మేర నీరు ప్రవహిస్తోంది. కాఫర్ డ్యాం వద్ద సైతం వరద ప్రవాహం 28 మీటర్లకు చేరుకుంది.

 

చంద్రబాబుకు షాక్: కేశినేనీ, వల్లభనేని టీడీపీని వీడనున్నారా...?

తాజాగా కృష్ణా జిల్లాల్లో టీడీపీ సమన్వయ కమిటీ తాజాగా ఓ సమావేశం నిర్వహించింది. అయితే.. ఈ కీలక సమావేశానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సహా పలువురు టీడీపీ కీలక నేతలు డుమ్మా కొట్టారు. 

 

కేశినేని ఎఫెక్ట్...బుద్ధా వెంకన్న కీలక నిర్ణయం

ఒకరిపై మరొకరు ట్విట్టర్ వేదికగా కూడా విమర్శించుకున్నారు. ఒకే పార్టీ నేతలు ఇలా విమర్శించుకోవడం చూసి అందరూ షాకయ్యారు కూడా. తాజాగా... కేశినేని నాని కారణంగా... బుద్ధా వెంకన్న ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

 

ఏపీ పీసీసీ చీఫ్ గా పళ్లంరాజు..?

అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో మూడోసారి కూడా గెలుపొందారు. మళ్లీ మన్మోహన్ సింగ్ కేబినెట్ లో రక్షణ మంత్రిగా కొనసాగారు. అయితే 2012లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రక్షణ శాఖ మంత్రి నుంచి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 

 

అక్రమమైనింగ్ కేసులో టీడీపీ నేత యరపతినేనిపై కేసు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో యరపతినేని సహా 12 మంది సత్తెనపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. 

 

వరద, విద్యుత్ కోతలతో అల్లాడుతున్న ఏపీ ప్రజలు: ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్

ఆపదలో ఉన్న ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తక్షణమే సహాయ, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వరదల్లో చిక్కుకున్న ఓ బాధితుడి ఆవేదనకు సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 
 

పోలవరం రీటెండరింగ్ పై కేంద్రమంత్రి అసహనం: కౌంటర్ ఇచ్చిన మంత్రి అనిల్

పోలవరంలో దోపిడీ నిర్మూలన కోసమే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ చర్యలతోనే పోలవరం ఆలస్యమవుతోందనడంలో అర్థం లేదంటూ కౌంటర్ ఇచ్చారు. సెప్టెంబర్‌ వరకు పోలవరంలో ఎలాంటి పనులూ జరగవని తెలిపారు.సెప్టెంబర్‌ నెలలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కొత్త కాంట్రాక్టర్ కు పనులు అప్పగిస్తామని తెలిపారు. 

 

పదవిపోయినా గ్రాము కొవ్వు తగ్గలేదు: దేవినేనిపై పేర్నినాని వ్యాఖ్యలు

పదవి పోయినా మదం మాత్రం దిగలేదని, జనం ఛీకొట్టినా గ్రాము కొవ్వు కూడా దిగేలదని మాజీ మంత్రి దేవినేనిపై నాని ఫైరయ్యారు. ముఖ్యమంత్రిని పేరు పెట్టి సంభోదిస్తున్నారని.. తలచుకుంటే తాము కూడా అనగలమంటూ మండిపడ్డారు. 

 

సానా సతీశ్ కేసులో కీలక మలుపు: షబ్బీర్ అలీకి నోటీసులు

సానా సతీశ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసులు జారీ చేయగా.. మరి కొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు ఈడీ సిద్ధమవుతోంది.

 

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణలో జరగనున్న శాసనమండలి ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖరారయ్యారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో చర్చించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌.. గుత్తా అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారు. 

 

భూమలు, డబ్బు నాకక్కర్లేదు... నన్ను అక్రమంగా ఇరికిస్తారా..?: ఆర్.కృష్ణయ్య

నయీం కేసు ఛార్జీషీటులో తన పేరు చేర్చడం పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వందల ఎకరాల భూములు సంపాదించుకుని, అక్రమ వ్యవహారాలు జరిపిన వారి పేర్లను పక్కనబెట్టడం రాజకీయ దురుద్దేశ్యమన్నారు

 

కేసీఆర్ గుండెలమీద చెయ్యివేసుకుని చెప్పు, తుగ్లక్ లా కాదు: మాజీమంత్రి పొన్నాల ఫైర్

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల అవసరం కంటే ప్రభుత్వ ప్రచార అవసరానికే బాగా ఉపయోగపడుతుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్లంపల్లిని ఒక ఇరిగేషన్ జంక్షన్ లా వాడుకుంటున్నారని ఆరోపించారు. 20 టీఎంసీల సామర్థ్యంతో ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎవరు నిర్మించారో కేసీఆర్ గుండెలమీద చెయ్యివేసుకుని చెప్పాలని నిలదీశారు. 

 

కశ్మీర్‌లో తెలుగు విద్యార్ధుల అవస్థలు: స్పందించిన తెలంగాణ ప్రభుత్వం

జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్ధితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. నిట్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్ధులను శ్రీనగర్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వారిని ఢిల్లీకి తీసుకురావాలని సీఎస్ ఎస్కే జోషి ఆదేశాలు జారీ చేశారు

 

కశ్మీర్‌లో హైటెన్షన్: శ్రీనగర్‌లో ఎయిర్‌పోర్టులో భారీ రద్దీ

అమర్‌నాథ్ యాత్ర రద్దు, బలగాల మోహరింపుతో జమ్మూకశ్మీర్‌లో హై టెన్షన్ నెలకొంది. దీంతో అక్కడ వున్న ఇతర రాష్ట్రాలకు చెందిన యాత్రికులు, పర్యాటకులతో పాటు ఉద్యోగులు, విద్యార్ధులు స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో ఒక్కసారిగా శ్రీనగర్ విమానాశ్రయంలో రద్దీ పెరిగింది

 

పుకార్లను నమ్మకండి..ఆందోళనొద్దు: ప్రజలకు కశ్మీర్ గవర్నర్ పిలుపు

అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేయడం, రాష్ట్రంలో కేంద్ర బలగాల మోహరింపు తదితర అంశాల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందించారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ప్రజలు ఆందోళనకు గురికావొద్దని ఆయన పిలుపునిచ్చారు.

 

మద్యం మత్తులో ఐఏఎస్ అధికారి బీభత్సం.. జర్నలిస్ట్ మృతి

కేరళకు చెందిన శ్రీరామ్‌ వెంకటరామన్‌ అనే ఐఏఎస్‌ అధికారి కారు వేగంగా నడిపి బైక్‌పై వెళ్తున్న పాత్రికేయుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రముఖ మలయాళ పత్రిక ‘సిరాజ్‌’ బ్యూరో ఛీఫ్‌ మహమ్మద్‌ బషీర్‌(35) మృతి చెందారు.

 

ఓ వ్యక్తి ఉన్మాదం: ఐదుగురు కుటుంబసభ్యుల్ని చంపి.. ఆత్మహత్య

సొంత కుటుంబ సభ్యుల్ని చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రంలోని బాఘపుర ఠాణా పరిధిలోని నథువాల్ అనే గ్రామానికి చెందిన సందీప్‌సింగ్ అనే వ్యక్తి తన నానమ్మ, తల్లి, తండ్రి, సోదరితో పాటు తన మూడేళ్ల కూతురిని తుపాకీతో కాల్చి చంపాడు

 

బిగ్ బాస్ 3: గుక్కపట్టి ఏడ్చేసిన శ్రీముఖి!

బిగ్ బాస్ సీజన్ 3 పన్నెండు ఎపిసోడ్‌‌లను ముగించుకుని శుక్రవారం నాడు పదమూడో ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఎనిమిది మంది ఎలిమినేషన్‌లో ఉండటంతో ఆట రంజుగా ప్రారంభమైంది. నేటి (ఆగష్టు 2) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం.
 

 

అమెరికా అమ్మాయితో ప్రభాస్ పెళ్లి..?

తాజాగా ప్రభాస్ అమెరికా అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. అమెరికాలో వ్యాపారిగా స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కూతురితో ప్రభాస్ పెళ్లి జరగనుందని సమాచారం. 
 

హీరో విశాల్ ని అరెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్!

తాజాగా నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీగా ఉన్న విశాల్ తన కార్యానిర్వాహక వర్గ జీతాలకు సంబంధించిన పన్నులు, టీడీఎస్ సరిగ్గా చెల్లించలేదని, అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

 

సుమ కోడలిగా మా ఇంట్లో అడుగుపెట్టాకే..!

దేవదాస్ కనకాలకి తన పిల్లలంటే విపరీతమైన ప్రేమ. చాలా ఇంటర్వ్యూలలో వారి గురించి చెప్పేవాడు. పిల్లల పట్ల అంచనాలు లేని తండ్రి ఉండడని.. తనకు కూడా కొన్ని అంచనాలు ఉన్నాయని.. వాటిని వారు అందుకుంటారనే నమ్మకం ఉందని చెప్పేవారు. 

 

బిగ్ బాస్ 3: బాయ్ ఫ్రెండ్ చనిపోయాడని కంటతడి పెట్టుకున్న పునర్నవి

బిగ్ బాస్ హౌస్‌లో గ్లామర్ బ్యూటీగా అడుగుపెట్టిన పునర్నవి భూపాలం.. తన లైఫ్‌లో జరిగిన భావోద్వేగ సంఘటనను షేర్ చేసుకుని ఇంటి సభ్యుల్ని ఎమోషన్‌కి గురిచేశారు. పాపా.. పాపా అంటూ తన వెంటపడి తనను ఎంతో బాగా చూసుకున్న తన రామ్‌ని కోల్పోయా అంటూ బాధపడింది.
 

ఎఫైర్ లేదంటూనే.. పార్టీ తరువాత అతడి కారులో..!

పార్టీ తరువాత కియారా.. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి వెళ్లిందంట. వారిద్దరూ ఒకే కారులో వెళ్లారని.. పార్టీ పూర్తయిన తరువాత అక్కడకి వచ్చిన సెలబ్రిటీలు ఎవరి దారిన వారు వెళ్లగా.. సిద్ధార్థ్ మల్హోత్రా మాత్రం కియారాను తనతో తీసుకెళ్లాడంటూ కథనాలను ప్రచురిస్తున్నాయి బాలీవుడ్ మీడియా వర్గాలు.

 

'సాహో': ప్రభాస్ లుక్స్ ని ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

 ప్రభాస్ లుక్స్ నచ్చకపోవడంతో కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ హెయిర్ స్టైల్, మేకప్ విషయంలో బాలీవుడ్ స్టైల్ ని ఫాలో అయింది చిత్రబృందం. అది మన తెలుగు ఆడియన్స్ కి రుచించడం లేదు. 

 

 

 

click me!