తెలుగు కుటుంబానికి చెందిన విశాల్ ని లీగల్ గా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీగా ఉన్న విశాల్ తన కార్యానిర్వాహక వర్గ జీతాలకు సంబంధించిన పన్నులు, టీడీఎస్ సరిగ్గా చెల్లించలేదని, అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలో ఐటీ అధికారులు విచారణకు హాజరు కావాల్సిందిగా పలుమార్లు నోటీసులు పంపినా విశాల్ స్పందించకపోవడంతో అధికారులు చెన్నైలోని ఎగ్మూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.

ఈ పిటిషన్ పై తాజాగా విచారణ జరిపిన ఎగ్మూర్ కోర్టు ఈసారి విశాల్ విచారణకు హాజరు కాని పక్షంలో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ఈ కేసుపై పునర్విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'అయోగ్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిసక్సెస్ అందుకున్న విశాల్ ప్రస్తుతం సుందర్ సి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.