సినీ నటుడు రాజీవ్ కనకాల తండ్రి, ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల అనారోగ్యం కారణంగా మృతి చెందారు. ఈరోజు ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు.

బ్రతికున్నప్పుడు ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొని ఎంతో సరదాగా మాట్లాడేవారు. ఇటీవల కూడా అలీ షోలో పాల్గొని ఆడవాళ్లు ఎంతో గొప్పవాళ్లు అంటూ వారిపై తన గౌరవాన్ని చాటాడు. దేవదాస్ కనకాలకి తన పిల్లలంటే విపరీతమైన ప్రేమ. చాలా ఇంటర్వ్యూలలో వారి గురించి చెప్పేవాడు.

పిల్లల పట్ల అంచనాలు లేని తండ్రి ఉండడని.. తనకు కూడా కొన్ని అంచనాలు ఉన్నాయని.. వాటిని వారు అందుకుంటారనే నమ్మకం ఉందని చెప్పేవారు. తన కూతురు బాగా చదువుకునేదని.. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివిందని చెప్పారు. ఈ క్రమంలో 'నటనా రంగం చాలా గొప్పదని, నటన నేర్చుకోవడానికి, నటించడానికి ఎంత మంది నిద్రాహారాలు మాని కష్టపడుతున్నారో చూడు' అని తనకు చాలా సార్లు నచ్చజెప్పారట.

కళామతల్లి సేవలో తరించే అవకాశం అందరికీ రాదని చెప్పేవారట. ఇంతలో కోడలిగా సుమ తమ ఇంటికి రావడం తన కూతురుపై ఎంతో ప్రభాస్ చూపించిందని.. నటన నేర్చుకొని చక్కటి ప్రదర్శన ఇవ్వాలనే తపన పెరిగిందని చెప్పుకొచ్చారు.