బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో 'సాహో' సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాపై ఎంత పాజిటివ్ బజ్ ఉందో అంతే నెగెటివిటీ కూడా ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల రెండు పాటలను విడుదల చేశారు.

ఈ పాటలకు కోట్లలో వ్యూస్ వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుండి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. 'సైకో సయాన్' పాటలో తెలుగు నేటివిటీ ఉండకపోవడంతో డబ్బింగ్ సాంగ్ ని చూస్తోన్న ఫీలింగ్ కలిగింది. రెండో పాట 'ఏ చోట నువ్వున్నా'ఓ ఇంగ్లీష్ సాంగ్ కి కాపీ అని తెలుస్తోంది.

పైగా ఈ పాటలో ప్రభాస్ లుక్స్ నచ్చకపోవడంతో కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ హెయిర్ స్టైల్, మేకప్ విషయంలో బాలీవుడ్ స్టైల్ ని ఫాలో  అయింది చిత్రబృందం. అది మన తెలుగు ఆడియన్స్ కి రుచించడం లేదు. మేకప్, స్టైల్ ప్రభాస్ కి సూట్ కాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఒక ఫ్రేమ్ లో అయితే ప్రభాస్ పెదాలు, హెయిర్ స్టైల్ సరిగ్గా లేకపోవడంతో స్క్రీన్ షాట్స్ షేర్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఈ పాటలో ప్రభాస్ ఒక చోట మంచు విష్ణులా ఉన్నాడని, మరోచోట సాయి ధరం తేజ్ లా ఉన్నాడంటూ కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ రకమైన ట్వీట్ లు చూస్తోన్న ప్రభాస్ ఫ్యాన్స్ బాగా అప్సెట్ అవుతున్నారు.