బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. 'భరత్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత 'వినయ విధేయ రామ' సినిమాలో నటించింది. ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో గ్యాప్ తీసుకొని బాలీవుడ్ లో బిజీ అయింది. వెబ్ సిరీస్, సినిమాలంటూ బిజీ హీరోయిన్ గా మారింది. 
ఇటీవల ఆమె నటించిన 'కబీర్ సింగ్' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 

ఈ సినిమా రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ తన పుట్టినరోజు పార్టీని గ్రాండ్ గా నిర్వహించింది. తన సన్నిహితులు, స్నేహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. 'కబీర్ సింగ్' హీరో షాహిద్ కపూర్ తో సహా చాలా మంది సెలబ్రిటీలు పార్టీకి హాజరయ్యారు. రామ్ చరణ్ కూడా అటెండ్ అయినట్లు సమాచారం. అయితే పార్టీ తరువాత చోటు చేసుకున్న కొన్ని సన్నివేశాలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ముంబై మీడియా ఓ విషయాన్ని హైలైట్ చేస్తూ వార్త రాసుకొచ్చింది. పార్టీ తరువాత కియారా.. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి వెళ్లిందంట. వారిద్దరూ ఒకే కారులో వెళ్లారని.. పార్టీ పూర్తయిన తరువాత అక్కడకి వచ్చిన సెలబ్రిటీలు ఎవరి దారిన వారు వెళ్లగా.. సిద్ధార్థ్ మల్హోత్రా మాత్రం కియారాను తనతో తీసుకెళ్లాడంటూ కథనాలను ప్రచురిస్తున్నాయి బాలీవుడ్ మీడియా వర్గాలు.

చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ జంట వాటిని ఖండిస్తూనే ఉన్నారు. తామిద్దరం మంచి స్నేహితులమని చెబుతున్నా.. ఇలాంటి వార్తలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి.