తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో యరపతినేని సహా 12 మంది సత్తెనపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది.

అక్రమ మైనింగ్‌పై తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పిడుగురాళ్లకు చెందిన గురువాచారి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో నిందితులపై వెంటనే కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.