సొంత కుటుంబ సభ్యుల్ని చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రంలోని బాఘపుర ఠాణా పరిధిలోని నథువాల్ అనే గ్రామానికి చెందిన సందీప్‌సింగ్ అనే వ్యక్తి తన నానమ్మ, తల్లి, తండ్రి, సోదరితో పాటు తన మూడేళ్ల కూతురిని తుపాకీతో కాల్చి చంపాడు.

అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదే ఘటనలో సందీప్ తాతయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అయితే తన సందీప్ ఇంతటి దారుణానికి ఎందుకు పాల్పడ్డాడో మాత్రం పోలీసులకు అంతుచిక్కడం లేదు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.