టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. బాహుబలి సినిమాకి ముందే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత షెడ్యూల్స్ బిజీగా ఉన్నాయని.. బాహుబలి తరువాత ఆయన పెళ్లి ఖాయమని అన్నారు. కానీ బాహుబలి సినిమా విడుదలై ఇప్పటికి రెండేళ్లు దాటిపోతుంది. కానీ ఇంకా పెళ్లి ఊసే లేదు.

పైగా ఇప్పుడు 'సాహో' సినిమాతో బిజీగా గడుపుతున్నారు. ఈ నెలాఖరుకి ఆ సినిమా కూడా రిలీజ్ కి సిద్ధమవుతోంది. కొద్దిరోజుల క్రితం ప్రభాస్ ని పెళ్లి విషయంపై ప్రశ్నిస్తే.. అంతా పెదనాన్న ఇష్టమే అంటూ తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. అలా కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లిపై ఏమైనా క్లారిటీ ఇచ్చారా అంటే అది కూడా లేదు. మరికొద్ది రోజుల్లో ప్రభాస్ 40వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు.

దీంతో ఆయన ఫ్యాన్స్ లో ప్రభాస్ పెళ్లి విషయంపై మరింత ఆసక్తి పెరిగిపోయింది. గతంలో ప్రభాస్.. అనుష్కని పెళ్లి చేసుకోబోతున్నారని.. ఈ విషయంలో ఇరు కుటుంబసభ్యులు  మాట్లాడుకున్నారని మాటలు వినిపించాయి. అయితే ఈ జంట మాత్రం ఆ వార్తలను ఖండించింది. తామిద్దరం మంచి స్నేహితులమని క్లారిటీ ఇచ్చింది. 

తాజాగా ప్రభాస్ అమెరికా అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. అమెరికాలో వ్యాపారిగా స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కూతురితో ప్రభాస్ పెళ్లి జరగనుందని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో ప్రభాస్ కుటుంబం స్పందించాల్సివుంది.