బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మొదలై రెండో వారం పూర్తికావొస్తుంది. తొలి కెప్టెన్ గా వరుణ్ సందేశ్ ఎంపికయ్యారు. అతడు కెప్టెన్ గా ఎలా వ్యవహరించాలనే విషయంపై అతడి భార్య వితికా చెప్పడం మొదలుపెట్టింది. ఇక రీసెంట్ గా జరిగిన ఓ ఎపిసోడ్ లో అలీ రజాను బండబూతులు తిట్టిన తమన్నాతో రాజీపడ్డాడు. మిమ్మల్ని బాధ పెట్టాలని నేను అలా చేయలేదని.. గేమ్ లో భాగంగానే వాళ్లతో వేషాలు వేయించానని.. దాని వల్ల మీరు హర్ట్ అయితే క్షమించండి అంటూ తమన్నాను కోరాడు.

దీంతో ఆమె శాంతించింది. ఇక హౌస్ లో గ్లామర్ డాల్ పునర్నవిని సరదాగా డేట్ కి అడిగాడు రాహుల్. దానికి ఆమె అసలు నా రిలేషన్ షిప్ స్టేటస్ అడిగావా..? అని ప్రశ్నించింది. దీనికి రాహుల్ ఎవరితో అయినా రిలేషన్ లో ఉన్నావా అని అడిగాడు. దానికి పునర్నవి 'అవును' అంటూ తన లవ్ స్టోరీ బయటపెట్టింది. అతడు ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

శుక్రవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఒక టాస్క్ ఇచ్చారు. తమ జీవితంలో జరిగిన.. మళ్లీజరగకూడదని కోరుకునే ఎమోషనల్ సందర్భాలను గుర్తు చేసుకోవాలని బిగ్ బాస్ కోరడంతో ఎపిసోడ్ మొత్తం ఎమోషనల్ గా అయిపోయింది. ఒక్కొక్కరూ తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటే శివజ్యోతి తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేకపోయింది. హౌస్‌లో అల్లరి చిల్లరిగా అందర్నీ నవ్విస్తూ సరదాగా ఉంటే శ్రీముఖి ఒక్కసారిగా ఎమోషన్ అయ్యింది. 

తన తాత చనిపోయే ముందు తనను చూడాలని కోరుకున్నాడని.. అయితే ఆయన తనను చూడకుండానే చనిపోయాడంటూ.. అప్పటికి ఆయనకు పక్షవాతం ఉండటంతో ఆ విషయాన్ని ఆయనచెప్పలేకపోయారంటూ కన్నీరుమున్నీరైంది. ఇక శివజ్యోతి తన ప్రేమ కథను చెప్పుకొని ఎమోషనల్ అయింది. మహేష్ విట్టా తన ఫ్రెండ్ ని కోల్పోయిన సందర్భాన్ని,  పునర్నవి తనను ప్రేమించిన వాడిని కోల్పోయిన సందర్భాన్ని, వితికా వాళ్ల పిన్ని గురించి, వరుణ్ వాళ్ల నాన్న గురించి, రవిక్రిష్ణ, జాఫర్, బాబా భాస్కర్‌లు వాళ్ల ఫ్యామిలీ గురించి గుర్తు చేసుకుని ఎమోషనల్‌గా మాట్లాడారు.