మహేష్‌బాబుపై పూరి జగన్నాథ్ సంచలనం: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Jul 19, 2019, 6:09 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

బాంబు పేల్చిన మాధవ్.. బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్సీలు

టీడీపీలోకి కొందరు ఎమ్మెల్సీలు తమపార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని మాధవ్ చెప్పారు. రాజీనామా చేసే విషయంలో అడ్డంకి ఉందని లేకపోతే ఈపాటికి తమ పార్టీ తీర్థం పుచ్చుకునేవారని మాధవ్ తెలిపారు.  జగన్ చేసిన ప్రకటన కారణంగా వలసలకు ఇబ్బందిగా మారిందని మాధవ్ అన్నారు. 
 

జగన్ అలా చేస్తే.. ఇక ఏపీలో రాష్ట్రపతి పాలనే... యనమల

జగన్ తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. లేదంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందన్నారు. కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేస్తే ఆర్టికల్-257 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్రానికి ఉందని ఆయన గుర్తు చేశారు.

 

ఏపీ సీఎం జగన్ కు కీలక పదవి: కేబినెట్ నిర్ణయాలు ఇవే.....

2018లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీఈడీబీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపోతే సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన ఏర్పడిన ఏపీఈడీబీ ఏపీఐపీఎంఎల్ లో శాశ్వత ప్రత్యేక సలహామండలిగా వ్యవహరించనుంది. 

 

అంతా వైసీపీ వల్లే: అమరావతి ప్రాజెక్టు నుంచి వరల్డ్ బ్యాంక్ తప్పుకోవడంపై బాబు

అమరావతి ప్రాజెక్టు నుండి ప్రపంచ బ్యాంకు నుండి తప్పుకోవడంపై చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ నేతల నిర్వాకం వల్లే వరల్డ్ బ్యాంకు వెనక్కు వెళ్లిందని బాబు అభిప్రాయపడ్డారు.

 

నలుగురితో వివాహం...ఐదో పెళ్లి కోసం వేధింపులు

అప్పటికే నలుగురిని వివాహం చేసుకున్నాడు. అయినా అతనికి అమ్మాయిలపై మోజు తీరలేదు. మరో యువతిపై కన్నేశాడు. ఆమెను ఐదో వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అయితే అందుకు ఆ యువతి అంగీకరించలేదు. దీంతో పగపట్టి.. వేధించాడు. అయినా ఒప్పుకోకపోవడంతో కొడవలితో దాడి చేశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో చోటుచేసుకుంది.

 

టీడీపీ నేతల ఆందోళన... స్పీకర్ అసహనం

శుక్రవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా... సభ ప్రారంభం కాగానే.. పోలవరంపై చర్చ జరిపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కానీ వారి డిమాండ్ ని అధికార పక్షం పట్టించుకోలేదు. పోలవరంపై  చర్చకు అనుమతి ఇవ్వలేదు. దీంతో.. టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు.

 

పోలవరంలో దోపిడి.. ఇంకో 20 రోజులే,అన్ని బయటపడతాయి: జగన్

పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీ అసెంబ్లీలో భారీ చర్చ జరిగింది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ పరిణామంతో సభలో గందరగోళం నెలకొంది.

 

కేశినేని వర్సెస్ పీవీపీ: నీ ప్రియుడు ఎవరు రాజా అంటూ పీవీపీ సెటైర్లు

విజయవాడ ఎంపీ కేశినేని నాని.. వైసీపీ నేత పీవీపీల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. తాత డబ్బులతో సోకు చేసే వాళ్లతో దేశానికి నష్టం లేదంటూ కేశినేని మరోసారి ఫైరయ్యారు.

 

జగన్‌కు షాక్: అమరావతి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న వరల్డ్‌బ్యాంక్

అమరావతి నిర్మాణం నుంచి ప్రపంచబ్యాంక్ తప్పుకున్నట్లుగా ప్రకటించింది. రాజధాని ప్రాంతంలోని రైతులు, ప్రజాసంఘాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 

 

మేమొస్తే టీఆర్ఎస్ మునక: కోమటిరెడ్డి, బీజేపీలో చేరడం కరెక్టేనా: రామలింగారెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో  కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే  సోలిపేట రామలింగారెడ్డి మధ్య శుక్రవారం నాడు ఆసక్తికర చర్చ జరిగింది. బీజేపీలో చేరిక విషయమై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సోలిపేట రామలింగారెడ్డి ప్రశ్నించారు.

 

నేను మాట్లాడాల్సింది నువ్వు చెబుతావా: భట్టిపై కేసీఆర్ ఫైర్

ప్రతిపక్షంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మున్సిపల్ చట్టంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష సభ్యులు రాష్ట్రానికి ఏం చేయాలన్నా అడ్డు తగులుతున్నారని ఆరోపించారు.

 

మనవడి నిర్వాహకం... క్షమాపణలు చెప్పిన హోంమంత్రి మహమూద్ అలీ

 తెలంగాణ డీజీపీ పపేరిట రిజిస్టర్ అయిన ఓ వాహనంపై కూర్చుని పోలీసులను కించపరుస్తూ.. హోం మంత్రి మహమూద్ అలీ మనవడు, అతని స్నేహితుడు టిక్ టాక్ వీడియో చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ గా మారింది. పోలీసు వ్యవస్థను కించపరిచేలా హోం మంత్రి మనవడు ఇలాంటి వీడియో చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

 

ట్రాఫిక్ పోలీసుని చెప్పుతో కొట్టిన టీఆర్ఎస్ మహిళా నేత

ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఓ టీఆర్ఎస్ మహిళా నేత చెప్పుతో కొట్టిన సంఘటన కలకలం రేపుతోంది. ద్విచక్రవాహనంపై ముగ్గురు వెళ్తున్నారని... ఫోటో తీసిన కారణం చేత కానిస్టేబుల్ ని టీఆర్ఎస్ మహిళా నాయకురాలు చెప్పుతో కొట్టింది. ఈ సంఘటన మల్కాజిగిరి మౌలాలి కమాన్ సమీపంలో చోటుచేసుకుంది.

 

రూపాయికే రిజిస్ట్రేషన్.. ఇంటిపన్ను కేవలం రూ.100: కేసీఆర్

మున్సిపల్ చట్టం - 2019పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘంగా ప్రసంగించారు. పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలు 75 చదరపు అడుగుల వరకు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

 

హిట్స్ ఉంటేనే మహేష్ చేస్తాడు.. నాకూ క్యారెక్టర్ ఉంది.. పూరి సంచలనం!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో మాస్ సెంటర్స్ నుంచి ఈ చిత్రానికి వసూళ్లు అదిరిపోతున్నాయి. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో ఇస్మార్ట్ శంకర్ టీం బిజీగా పాల్గొంటోంది. 

 

పబ్లిసిటీ కోసం కాదు.. నాకు మారాలనే ఉద్దేశం కూడా లేదు.. రణవీర్ సింగ్!

బాలీవుడ్ క్రేజీ హీరో రణవీర్ సింగ్ తన వ్యక్తిత్వంపై ఆసక్తికరమైన ప్రకటన చేశారు. బాలీవుడ్ లో అందరి నటీనటుల కన్నా రణవీర్ భిన్నంగా ఉంటాడు. తన వ్యక్తిత్వంపై అనేక ఉహాగానాలు కూడా వచ్చాయని రణవీర్ తెలిపాడు. వస్త్రధారణ, మాట్లాడే విధానం గురించి చాలా పుకార్లు వినిపించాయి. దీనిపై రణవీర్ క్లారిటీ ఇచ్చాడు. 

 

విక్రమ్ 'మిస్ట‌ర్ కేకే' మూవీ రివ్యూ

ప్రెంచ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన  Point Blank (2010) అనే క్రైమ్ థ్రిల్లర్ ని  అఫీషియల్ రైట్స్ తీసుకుని రీమేక్ చేయాలనే కమల్ ఆలోచన గొప్పదే. మెయిన్ పాయింట్ లేపేసి మనం కథ అల్లేసుకోవచ్చు కదా అని ఆలోచన రాకపోవటం అద్బుతమే. 

 

అమలాపాల్ 'ఆమె' చిత్రానికి షాక్.. షోలు రద్దు.. కారణం ఇదే!

అమలాపాల్ నటించిన ఆమె చిత్రం మొదటినుంచి వివాదాల్లో చిక్కుకుంటోంది. అమలాపాల్ ఈ చిత్రంలో బోల్డ్ గా నటించింది. ప్రచార చిత్రాల్లో నగ్నంగా కనిపించి అందరిని షాక్ కి గురిచేసింది. అమలాపాల్ ఇలా బోల్డ్ గా నటించడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. 

 

ఇన్నిరోజులు సీక్రెట్ గా.. గర్భంతో ఉన్నట్లు ప్రకటించిన శృతి!

ప్రముఖ హీరోయిన్ శృతి హరిహరన్ కన్నడలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కన్నడ, మలయాళీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. 30 ఏళ్ల ఈ నటి గత ఏడాది మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సమయంలో వార్తల్లో నిలిచింది. సీనియర్ హీరో అర్జున్ తనని లైంగికంగా వేధించాడంటూ ఫిర్యాదు చేసింది. అప్పటి వరకు శృతి హరిహరన్ కు పెళ్ళైన సంగతి ఆమె సన్నిహితులకు తప్ప మరెవరికీ తెలియదు. 

 

ఘోర ప్రమాదంలో బాలనటుడు దుర్మరణం!

ఈ మధ్య కాలంలో రోడ్డు యాక్సిడెంట్స్ విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెల్సిందే. దారుణమైన ఆ ప్రమాదాల నివారణకు పోలీసులు, ప్రభుత్వాలు ఎన్నో రకాల భద్రతా చర్యలను చేపడుతూ, అమలు చేస్తున్నప్పటికీ.. ప్రయోజనం కనిపించడం లేదు. 

 

ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. పూరి ఈజ్ బ్యాక్.. రామ్ కెరీర్ లోనే!

టాలీవుడ్ లో చాలా మంది మాస్ చిత్రాలని అద్భుతంగా తెరకెక్కించే దర్శకులు ఉన్నారు. వివి వినాయక్, శ్రీనువైట్ల లాంటి దర్శలకుల చిత్రాలు బి, సి సెంటర్స్ లో బాగా ఆడతాయి. వీరందరిలో పూరి శైలి ప్రత్యేకం. కాకపోతే ఇటీవల పూరి జగన్నాధ్ కథ ఎంపికలో పొరపాట్లు చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

 

రాజమౌళి ‘RRR’లో ఆఫర్, మహిళకి రూ.50లక్షల టోకరా

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా చేస్తున్న ఈ చిత్రంలో వేషం వేయాలని నటులు అవుదామనుకునే చాలా మందికి ఉంటుంది. అయితే ఆ అవకాసం అతి కొద్ది మందికే వస్తుంది. 

 

తాప్సీ రికమండేషన్ తోనే తమన్నాకు ఆఫర్

హీరోయిన్స్ ఒకప్పుడు అసూయతో ఉండేవారు అంటారు. కానీ ఇప్పుడు సిట్యువేషన్ వేరేగా ఉంది. వాళ్ల మధ్య హెల్థీ రిలేషన్ షిప్ ఉంటోంది. తమకు వచ్చిన ఆఫర్ ని సైతం వేరే హీరోయిన్ కు రికమెండ్ చేస్తున్నారు. 

 

 

కర్ణాటక క్రైసిస్: మూడో దఫా గవర్నర్ డెడ్‌లైన్, కోర్టుకు కుమారస్వామి

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం నాడు కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. శుక్రవారం నాడు సాయంత్రం ఆరు గంటల వరకు బలపరీక్ష చేసుకోవాలని గవర్నర్ వాజ్‌భాయ్ వాలా సూచించారు. 

 

కర్ణాటక సంక్షోభం: బలపరీక్ష డౌటే, బాంబు పేల్చిన సిద్ధరామయ్య

సభలో చర్చ జరుగుతోందని అది ఇంకా ముగియలేదన్నారు. సభలో ఇంకా 20 మంది సభ్యులు మాట్లాడాల్సి ఉందన్నారు. సభ్యులంతా మాట్లాడిన తర్వాతే బలపరీక్ష ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతానికి అసెంబ్లీలో బలపరీక్ష జరుగుతుందనే గ్యారంటీ లేదన్నారు. 

 

 

యడ్యూరప్ప సీఎం కావాలని.. బీజేపీ ఎంపీ ఏం చేశారంటే...

బీజేపీ కర్ణాటక ఎంపీ శోభ కరండ్లజే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చాముండేశ్వరీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకముందు ఆలయంలోకి వెళ్లేందుకు ఆమె 1001 మెట్లు ఎక్కడం విశేషం.

 

యూపీలో ప్రియాంక గాంధీ అరెస్ట్

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నారయణ్‌పూర్ కాల్పుల్లో మరణించిన వారి కుటుంబసభ్యులను కలుసుకోవడానికి ప్రియాంక శుక్రవారం అక్కడికి వెళ్లారు. అయితే ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ కొనసాగుతున్నందున ఎలాంటి పర్యటనలను అనుమతించబోమని పోలీసులు తేల్చి చెప్పారు.

click me!