కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నారయణ్‌పూర్ కాల్పుల్లో మరణించిన వారి కుటుంబసభ్యులను కలుసుకోవడానికి ప్రియాంక శుక్రవారం అక్కడికి వెళ్లారు. అయితే ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ కొనసాగుతున్నందున ఎలాంటి పర్యటనలను అనుమతించబోమని పోలీసులు తేల్చి చెప్పారు.

అంతేకాకుండా ప్రియాంకతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కాగా.. సోంభద్ర సమీపంలోని ఓ ఐఏఎస్ అధికారి తనకి చెందిన 22 ఎకరాలను రెండు సంవత్సరాలు క్రితం యాగ్య దత్ అనే వ్యక్తికి అమ్మారు.

అయితే దత్ భూమిని ఆక్రమించుకునేందుకు కొంత మంది ప్రయత్నించగా భారీగా గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే బుధవారం ఇరు వర్గాల మధ్య గొడవ తారాస్థాయికి చేరి.. తుపాకులతో ఒకరినొకరు కాల్చుకున్నారు. ఈ కాల్పుల్లో 10 మంది మరణించగా.. 19 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.