బాలీవుడ్ క్రేజీ హీరో రణవీర్ సింగ్ తన వ్యక్తిత్వంపై ఆసక్తికరమైన ప్రకటన చేశారు. బాలీవుడ్ లో అందరి నటీనటుల కన్నా రణవీర్ భిన్నంగా ఉంటాడు. తన వ్యక్తిత్వంపై అనేక ఉహాగానాలు కూడా వచ్చాయని రణవీర్ తెలిపాడు. వస్త్రధారణ, మాట్లాడే విధానం గురించి చాలా పుకార్లు వినిపించాయి. దీనిపై రణవీర్ క్లారిటీ ఇచ్చాడు. 

నాది భిన్న తరహా మనస్తత్వం అని నాకు తెలుసు, నేనెప్పుడూ ఆ విషయాన్నీ దాచే ప్రయత్నం కూడా చేయలేదు. నేను చిన్నతనం నుంచి ఒకేలా ఉన్నాను. ప్రస్తుతం నాకు మారాలనే ఉద్దేశం కూడా లేదు. నేను నా కుటుంబసభ్యులకు స్నేహితులకు మాత్రమే కల్మషం లేని వ్యక్తిగా కనిపిస్తాను అని రణవీర్ తెలిపాడు. 

నేను మూడో తరగతి లోనే నేను మోహాక్ హెయిర్ స్టైల్ ట్రై చేశాను, ఆ ఫోటోను ఇటీవలే సోషల్ మీడియా లో కూడా పెట్టాను. ఇలాంటి ఫోటోలు నా దెగ్గర  కోకోల్లలు ఉన్నాయి, నా విచిత్ర వైఖరిని రుజువు చేస్తాయి. నేనేదో వ్యూహం ప్రకారం, పబ్లిసిటీ కోసం ఇలా చేయడం లేదు. నేనెప్పుడూ ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి కామెంట్స్ చేయను. అలాగే నా జీవితం గురించి కూడా విమర్శలు వినదలుచుకోలేదు అని రణవీర్ తెలిపాడు.