హైదరాబాద్:  కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి మధ్య శుక్రవారం నాడు అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. అసెంబ్లీ లాబీల్లో ఇద్దరు నేతలు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు.

బీజేపీలో చేరితే మీ గొంతును మీరు కోసుకొన్నట్టేనని రామలింగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో అన్నారు.  టీఆర్ఎస్‌ ఇప్పటికే ఓవర్‌లోడ్‌లో ఉంది, మాది ఓవర్ వెయిట్... మేం టీఆర్ఎస్ లోకి వస్తే  మునుగుతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

పార్టీ మారినందుకు చిరుమర్తి లింగయ్యను తప్పుపడుతున్నావు... మరి నీవెందుకు బీజేపీలోకి వెళ్తున్నావని  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని  సోలిపేట రామలింగారెడ్డి ప్రశ్నించారు.   తాను చిరుమర్తి లింగయ్యకు ప్రతి నెల రూ. 50 వేలు జీతం ఇచ్చానని ఆయన గుర్తు చేసుకొన్నారు.  చిరుమర్తి లింగయ్యను తాను కాపాడానని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

మా అన్న కూడ బీజేపీలోకే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనం

కోమటిరెడ్డి దుస్థితి: కాంగ్రెసు పొమ్మంటోంది, బిజెపి రమ్మనడం లేదు