కర్ణాటక రాజకీయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విశ్వాసపరీక్షలో విజయం ఎవరు సాధిస్తారా అని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ.. కర్ణాటక అసెంబ్లీలో మాత్రం హైడ్రామా ఇంకా కొనసాగుతోంది. నిన్నటితో ఫలితం వెలువడాల్సి ఉండగా.. నేటీకీ ఏదీ తేలలేదు. ఇదిలా ఉంటే.... కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి..యడ్యూరప్ప ముఖ్యమంత్రి కావాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు.

బీజేపీ కర్ణాటక ఎంపీ శోభ కరండ్లజే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చాముండేశ్వరీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకముందు ఆలయంలోకి వెళ్లేందుకు ఆమె 1001 మెట్లు ఎక్కడం విశేషం. ఆమెతోపాటు పలు పార్టీ కార్యకర్తలు కూడా 1001 మెట్లు ఎక్కారు. అనంతరం యడ్యురప్ప ముఖ్యమంత్రి కావాలంటూ ఆలయంలో పూజలు చేశారు.