ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఓ టీఆర్ఎస్ మహిళా నేత చెప్పుతో కొట్టిన సంఘటన కలకలం రేపుతోంది. ద్విచక్రవాహనంపై ముగ్గురు వెళ్తున్నారని... ఫోటో తీసిన కారణం చేత కానిస్టేబుల్ ని టీఆర్ఎస్ మహిళా నాయకురాలు చెప్పుతో కొట్టింది. ఈ సంఘటన మల్కాజిగిరి మౌలాలి కమాన్ సమీపంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మల్కాజిగిరి మౌలాలి కమాన్ వద్ద ముజఫర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. కాగా.. గౌన్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణించడానికి లేదు. అందుకే.. ఆ వాహనాన్ని కానిస్టేబుల్ ముజఫర్ ఫోటో తీశాడు. అది  గమనించిన గౌస్.. కానిస్టేబుల్ ని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఈ సంఘటన జరిగిన సరిగ్గా 15నిమిషాల తర్వాత నలుగురు వ్యక్తులు వచ్చి కానిస్టేబుల్ పై దాడి చేశారు. వారిలో టీఆర్ఎస్ మహిళా పేత సయ్యద్ మహమ్మద్ బేగం కూడా ఉన్నారు. ఆమె తన చెప్పుతో కానిస్టేబుల్ ని కొట్టి.. అతని వద్ద ఉన్న కెమేరాను కూడా లాక్కోవడం విశేషం. కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ పై దాడి చేసిన వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.