కర్ణాటక క్రైసిస్: మూడో దఫా గవర్నర్ డెడ్‌లైన్, కోర్టుకు కుమారస్వామి

By narsimha lodeFirst Published Jul 19, 2019, 4:53 PM IST
Highlights

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం నాడు కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. శుక్రవారం నాడు సాయంత్రం ఆరు గంటల వరకు బలపరీక్ష చేసుకోవాలని గవర్నర్ వాజ్‌భాయ్ వాలా సూచించారు. 

బెంగుళూరు: శుక్రవారం సాయంత్రం ఆరు గంటల లోపుగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని కర్ణాటక గవర్నర్ వాజ్‌భాయ్ వాలా సీఎం కుమారస్వామికి లేఖ రాశాడు. అయితే  గవర్నర్ ఈ రకంగా లేఖ రాయడంపై సీఎం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.మరో వైపు విప్‌పై కూడ స్పష్టత ఇవ్వాలని కూడ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

తొలుత గురువారం సాయంత్రం వరకే అసెంబ్లీలోనే బలాన్ని నిరూపించుకోవాలని  గవర్నర్ ఆదేశించారు. అయితే అసెంబ్లీని స్పీకర్ శుక్రవారం నాటికి వాయిదా వేశారు. తనను సుప్రీంకోర్టు కానీ, గవర్నర్ కానీ ఆదేశించలేరని  స్పీకర్ స్పష్టం చేశారు.

దీంతో గురువారం రాత్రి అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు నిద్రపోయారు. శుక్రవారం నాడు మధ్యాహ్నం ఒకటిన్నర వరకు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని  గవర్నర్ రెండోసారి ఆదేశాలు జారీ చేశారు. 

కానీ, శుక్రవారం నాడు అసెంబ్లీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో మరోసారి బీజేపీ బృందం గవర్నర్ ను కలిసింది. బీజేపీ ప్రతినిధుల విన్నపం  మేరకు  ఇవాళ సాయంత్రం వరకు  అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు.

ఈ ఆదేశాలపై  సీఎం కుమారస్వామి సుప్రీంకోర్టును  ఆశ్రయించారు. ఎమ్మెల్యేలకు విప్ విషయమై స్పష్టత ఇవ్వాలని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ గుండురావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

కర్ణాటక సంక్షోభం: బలపరీక్ష డౌటే, బాంబు పేల్చిన సిద్ధరామయ్య

కర్ణాటక బలపరీక్షలో హైడ్రామా: ముగిసిన గవర్నర్ గడువు

యడ్యూరప్ప సీఎం కావాలని.. బీజేపీ ఎంపీ ఏం చేశారంటే...

కర్ణాటక సంక్షోభం: కాంగ్రెస్‌పై కుమారస్వామి వ్యాఖ్యలు, ఇరు వర్గాల వాగ్వాదం

click me!