Asianet News TeluguAsianet News Telugu

బాంబు పేల్చిన మాధవ్.. బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్సీలు

టీడీపీలోకి కొందరు ఎమ్మెల్సీలు తమపార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని మాధవ్ చెప్పారు. రాజీనామా చేసే విషయంలో అడ్డంకి ఉందని లేకపోతే ఈపాటికి తమ పార్టీ తీర్థం పుచ్చుకునేవారని మాధవ్ తెలిపారు.  జగన్ చేసిన ప్రకటన కారణంగా వలసలకు ఇబ్బందిగా మారిందని మాధవ్ అన్నారు. 
 
bjp mlc madhav says, tdp key leaders may join in bjp
Author
Hyderabad, First Published Jul 19, 2019, 3:53 PM IST

తెలుగు రాష్ట్రాల్లో బలం పెంచుకునేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఆకర్ష్ మంత్రం ఉపయోగించి.. కీలక నేతలను తమ పార్టీలో చేరేలా చేస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీలో చేరగా... మరికొందరు కీలక నేతలు బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా.. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

టీడీపీలోకి కొందరు ఎమ్మెల్సీలు తమపార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని మాధవ్ చెప్పారు. రాజీనామా చేసే విషయంలో అడ్డంకి ఉందని లేకపోతే ఈపాటికి తమ పార్టీ తీర్థం పుచ్చుకునేవారని మాధవ్ తెలిపారు.  జగన్ చేసిన ప్రకటన కారణంగా వలసలకు ఇబ్బందిగా మారిందని మాధవ్ అన్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నట్లు  చెప్పారు. ఆగస్టు తర్వాత ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు మాధవ్ చెప్పారు. రాష్ట్రానికి ఒక కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగడానికి ముందు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు కూడా తమ తో టచ్ లో ఉన్నారని చెప్పారు. కాగా... మాధవ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లే ఆ ఎమ్మెల్సీలు ఎవరై ఉంటారా అనే ఆసక్తి పెరిగిపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios