టాలీవుడ్ లో చాలా మంది మాస్ చిత్రాలని అద్భుతంగా తెరకెక్కించే దర్శకులు ఉన్నారు. వివి వినాయక్, శ్రీనువైట్ల లాంటి దర్శలకుల చిత్రాలు బి, సి సెంటర్స్ లో బాగా ఆడతాయి. వీరందరిలో పూరి శైలి ప్రత్యేకం. కాకపోతే ఇటీవల పూరి జగన్నాధ్ కథ ఎంపికలో పొరపాట్లు చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

మెహబూబా చిత్రం నిరాశపరిచిన తర్వాత తన సత్తా నిరూపించాలని పూరి గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఈ సారి మాస్ మసాలా ఎంటర్టైనర్ 'ఇస్మార్ట్ శంకర్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో హీరో రామ్ మునుపెన్నడూ లేని వీధంగా మాస్ లుక్ లో కనిపించాడు. యువ హీరోయిన్లు నభా నటేష్, నిధి అగర్వాల్ రామ్ కు జోడిగా నటించారు. 

గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి అదిరిపోయే వసూళ్లు నమోదయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 7.5 కోట్ల షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఇస్మార్ట్ శంకర్ చిత్ర షేర్ 8 కోట్లు దాటింది. 

హీరో రామ్ కెరీర్ లో ఇది హైయెస్ట్ ఓపెనింగ్స్. ఈ ఏడాది విడుదలైన వినయవిధేయ రామ, మహర్షి చిత్రాల తర్వాత ఇస్మార్ట్ శంకర్ చిత్రం అత్యధిక ఓపెనింగ్స్ సాధించింది. నైజాం లో తొలి రోజు ఏకంగా 3.2 కోట్ల షేర్ పిండుకుంది. సీడెడ్ లో 1.2 కోట్లు, ఉత్తరాంధ్రలో 86 లక్షలు, గుంటూరులో 57 లక్షల వసూళ్లు రాబట్టింది. ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఇదే జోరు కొనసాగిస్తే ఈ వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. ఈ చిత్రానికి 17 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది.