అమరావతి:  వైసీపీ కారణం వల్లే ప్రపంచబ్యాంకు వెనక్కి తగ్గిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. అమరావతి నిర్మాణం కోసం పెట్టుబడి పెట్టే విషయంలో  ప్రపంచబ్యాంకు వెనక్కు తగ్గింది.  ఈ విషయమై చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు స్పందించారు.

ప్రపంచ బ్యాంక్ కు రైతుల నుండి తప్పుడు ఫిర్యాదు చేయించారని ఆయన ఆరోపించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు కూడ నిధులు రావని ఆయన అభిప్రాయపడ్డారు.

పులివెందుల గొడవలను ఇక్కడ కన్పిస్తున్నాయన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల ఇసుక ధరలు రెండింతలు పెరిగిందన్నారు. నిర్మాణాలు నిలిచిపోవడంతో కార్మికులు రోడ్డున పడ్డారని  చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అమరావతి నిర్మాణం కోసం ప్రపంచబ్యాంకు నిధులను కోరారు. ఈ మేరకు సీఆర్‌డిఏ ప్రపంచబ్యాంకు నిధుల కోసం ధరఖాస్తు చేశారు. ఈ ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు నుండి నిధులు వస్తాయని  అప్పటి సర్కార్ పనులను ప్రారంభించింది.

అమరావతి నిర్మాణం కోసం రూ. 7200 కోట్ల రుణం కోసం సీఆర్‌డీఏ ప్రపంచబ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. తొలి దశలో రూ. 3200 కోట్లు, రెండో దశలో రూ, 3200 కోట్లు తీసుకోవాలని అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది. తొలి దశ రుణం తీసుకొనేందుకు నాడు కేంద్రం కూడ అంగీకరించింది. బ్యాంకు సూత్రప్రాయ ఆమోదంతో కొన్ని ప్రాధాన్య మౌలిక వసతుల  కల్పన పనుల్ని సీఆర్‌డీఏ చేపట్టింది.

ప్రపంచబ్యాంకు నిధులతో చేపడుతున్న ప్రాజెక్టులు తమ ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తున్నాయని రాజధానికి చెందిన కొందరు బ్యాంకు ఇన్స్‌పెక్షన్  ప్యానెల్‌కు 2017 మే 25న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ప్రపంచబ్యాంకు టీమ్ అమరావతికి వచ్చింది.

అధికారులు, స్థానికులతో మాట్లాడింది. ప్రపంచబ్యాంకుకు ప్రాథమిక నివేదికను ఇచ్చింది. పూర్తి స్థాయి నివేదికకు ఇన్స్‌పెక్షన్ అవసరమని సిఫారసు చేసింది.ఈ సమయంలోనే ప్రభుత్వం మారింది.

 

సంబంధిత వార్తలు

జగన్‌కు షాక్: అమరావతి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న వరల్డ్‌బ్యాంక్

అమరావతి నిర్మాణానికి బ్రేకులు: ప్రపంచబ్యాంకు కొర్రీ