విజయవాడ ఎంపీ కేశినేని నాని.. వైసీపీ నేత పీవీపీల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. తాత డబ్బులతో సోకు చేసే వాళ్లతో దేశానికి నష్టం లేదంటూ కేశినేని మరోసారి ఫైరయ్యారు.

అక్కడితో ఆగకుండా బ్యాంకుల డబ్బుతో సోకు చేసే వాళ్లతోనే దేశానికి నష్టమని.. నిషానీల వల్ల దేశానికి ఎలాంటి నష్టం లేదని.. మేధావుల వల్ల మాత్రం దేశానికి నష్టమంటూ నాని ఘాటుగా ట్వీట్ చేశారు.

దీనికి అంతే  స్థాయలో కౌంటరిచ్చారు పొట్లూరి వరప్రసాద్. ‘‘కలవరమాయే మదిలో’’ అని క్యాప్షన్ పెట్టి నీ ప్రియుడు ఎవరు రాజా..? చంద్రబాబా... ఇంకొకరా, కేశినేని.. ఏమిటీ రంకు.. బొంకు అంటూ ధ్వజమెత్తారు. ముందు నీది పసుపు నిక్కరో.. ఖాకీ నిక్కరో తేల్చుకోవయ్యా సామీ అంటూ సెటైర్లు వేశారు.