కర్ణాటక సంక్షోభం: బలపరీక్ష డౌటే, బాంబు పేల్చిన సిద్ధరామయ్య

By Nagaraju penumalaFirst Published Jul 19, 2019, 2:56 PM IST
Highlights

సభలో చర్చ జరుగుతోందని అది ఇంకా ముగియలేదన్నారు. సభలో ఇంకా 20 మంది సభ్యులు మాట్లాడాల్సి ఉందన్నారు. సభ్యులంతా మాట్లాడిన తర్వాతే బలపరీక్ష ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతానికి అసెంబ్లీలో బలపరీక్ష జరుగుతుందనే గ్యారంటీ లేదన్నారు. 

కర్ణాటక: కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్షలో బాంబు పేల్చారు కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష నేత సిద్ధరామయ్య. ఇవాళ బలపరీక్ష లేనట్లేనని సందేహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య కర్ణాటక అసెంబ్లీలో ఇవాళ బలపరీక్ష జరిగే అవకాశం లేదని తేల్చి చెప్పారు.

సభలో చర్చ జరుగుతోందని అది ఇంకా ముగియలేదన్నారు. సభలో ఇంకా 20 మంది సభ్యులు మాట్లాడాల్సి ఉందన్నారు. సభ్యులంతా మాట్లాడిన తర్వాతే బలపరీక్ష ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చేశారు. 

ప్రస్తుతానికి అసెంబ్లీలో బలపరీక్ష జరుగుతుందనే గ్యారంటీ లేదన్నారు. అంతేకాదు ఈ చర్చ సోమవారం కూడా కొనసాగవచ్చునని తేల్చి చెప్పారు. ఇకపోతే సభలో కుమార స్వామి బలపరీక్ష శుక్రవారం లేనట్లేనని పరోక్షంగా హింట్ ఇచ్చారు సిద్ధరామయ్య. 

మరోవైపు శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలలోపు సభలో మెజారిటీ నిరూపించుకోవాలంటూ కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా సీఎం కుమారస్వామికి ఆదేశించారు. అందుకు కుమారస్వామి అంగీకారం కూడా తెలిపారు. 

గవర్నర్ గడువు దాటినప్పటికీ అసెంబ్లీలో ఎలాంటి చర్చ ప్రారంభం కాలేదు. చర్చ ముగిసేంత వరకు ఓటింగ్ జరిగే ప్రసక్తే లేదని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. తనను శాసించే హక్కు గవర్నర్ కు లేదంటూ హెచ్చరించారు. 

గవర్నర్ వాజుభాయ్ వాలా ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ, కుమార స్వామి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లో ఈ అర్థరాత్రి 12 గంటలకు అయినా సరే బలపరీక్ష జరిపి తీరాల్సిందేనంటూ బీజేపీ నినాదాలు చేసింది. దీంతో సభ వాయిదా వేశారు స్పీకర్ రమేష్ కుమార్. 

కర్ణాటక బలపరీక్షలో హైడ్రామా: ముగిసిన గవర్నర్ గడువు

యడ్యూరప్ప సీఎం కావాలని.. బీజేపీ ఎంపీ ఏం చేశారంటే...

కర్ణాటక సంక్షోభం: కాంగ్రెస్‌పై కుమారస్వామి వ్యాఖ్యలు, ఇరు వర్గాల వాగ్వాదం

click me!