ఇన్నిరోజులు సీక్రెట్ గా.. గర్భంతో ఉన్నట్లు ప్రకటించిన శృతి!
ప్రముఖ హీరోయిన్ శృతి హరిహరన్ కన్నడలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కన్నడ, మలయాళీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది.
ప్రముఖ హీరోయిన్ శృతి హరిహరన్ కన్నడలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కన్నడ, మలయాళీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. 30 ఏళ్ల ఈ నటి గత ఏడాది మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సమయంలో వార్తల్లో నిలిచింది. సీనియర్ హీరో అర్జున్ తనని లైంగికంగా వేధించాడంటూ ఫిర్యాదు చేసింది. అప్పటి వరకు శృతి హరిహరన్ కు పెళ్ళైన సంగతి ఆమె సన్నిహితులకు తప్ప మరెవరికీ తెలియదు.
హీరోయిన్ గా కెరీర్ కాపాడుకోవడం కోసం తనకు పెళ్ళైన విషయాన్ని శృతి హరిహరన్ సీక్రెట్ గా ఉంచింది. రామ్ కుమార్ అనే రచయితని ఆమె రహస్య వివాహం చేసుకుంది. నాలుగేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన తర్వాత ఈ జంట వివాహం చేసుకుంది.
తాజాగా శృతి హరిహరన్ ఆసక్తికర విషయాన్ని ప్రకటించింది. తాను నిండు గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తన పుట్టబోయే బిడ్డని ఉద్దేశిస్తూ..నా జీవితం ఇప్పుడు నీ గుండె చప్పుళ్లతో నెలకొంది. ప్రపంచమనే సర్కస్ లోకి నిన్ను ఆహ్వానిస్తున్నా. నిన్ను చూసేందుకు ఎక్కువ కాలం ఎదురుచూడలేను అంటూ శృతి హరిహరన్ ఇంస్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది.