లోకేష్, విజయసాయి ట్వీట్స్ వార్, పార్టీ నేతలపై మైక్ విసిరిన జగ్గారెడ్డి: టాప్ స్టోరీస్

By rajesh yFirst Published Jun 29, 2019, 6:26 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

కాంగ్రెస్‌ సమావేశం: నేతల తీరుపై ఆగ్రహంతో మైక్ విసిరేసిన జగ్గారెడ్డి

జగ్గారెడ్డి ప్రతిపాదనను ఓ నేత సమర్ధిస్తూనే ఇంచార్జీలను నియమించాలనేది పార్టీ నిర్ణయంగా  తేల్చి చెప్పారు. దీంతో  అగ్రహంతో జగ్గారెడ్డి తన చేతిలో ఉన్న మైక్‌ను వేదికపైకి విసిరికొట్టాడు. ఈ తరుణంలో మిగిలిన నేతలు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
 

లోకేష్ మెదడు చిట్లింది, చేతబడి చేస్తున్నావా.. విజయసాయి రెడ్డి

‘మంగళగిరి ప్రజలు ఈడ్చి కొట్టిన తర్వాత లోకేశ్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది. స్థాయికి మరచి చెలరేగుతున్నారు. మీ తండ్రి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని మాపై కుట్ర చేశారు. ఇప్పడు అదే చిదంబరం,  ఆయన కొడుకు బెయిలుపై ఉన్నారు. మీ దొంగల ముఠాకు  మూడే రోజు దగ్గర్లోనే ఉంది.’’ అంటూ లోకేష్ పై సెటైర్లు వేశారు.
 

కేసీఆర్ మరో కూల్చివేత: ఎర్రవెల్లి ఫామ్ హౌస్ సైతం..

గురువారంనాడే కేసీఆర్ ఎర్రవెల్లిలో కొత్త ఫామ్ హౌస్ కు శంకుస్థాపన చేసినట్లు తెలుస్తోంది. కొత్త సచివాలయానికి, శాసనసభకు శంకస్థాపన చేయడానికి ముందే ఆ పనిచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ హౌస్ సరిపోవడం లేదని, దానికన్నా పెద్దది నిర్మించాలని ఆయన తలపెట్టినట్లు తెలుస్తోంది.
 

అందుకోసమే హ్యాట్రిక్ బంతిని అలా వేశా..: బుమ్రా

మ్యాచ్ పరిస్థితులను బట్టి హ్యాట్రిక్ వికెట్ కోసం తాను ఓ వ్యూహం రచించినట్లు బుమ్రా తెలిపాడు. '' మొదట బ్రాత్ వైట్ ఆ  వెంటనే అలెన్ ను ఔట్ వరుస బంతుల్లో ఔట్ చేసిన  వెంటనే బౌలర్ కీమర్ రోచ్ క్రీజులోకి వచ్చాడు. అతడు స్వతహాగా బౌలర్ కాబట్టి నేను హ్యాట్రిక్ సాధించేందుకు యార్కర్ బంతిని సంధిస్తానని ఊహిస్తాడు. కాబట్టి అలా కాకుండా ఓ స్లో బంతితో అతన్ని బోల్తా కొట్టించాలని అనుకున్నా. అయితే అనుభవజ్ఞుడైన రోచ్ ఆ విషయాన్ని పసిగట్టినట్లున్నాడు. దాన్ని కూడా చాలా బాగా అడ్డుకున్నాడు.'' అని బుమ్రా తెలిపాడు
 

బిగ్ బాస్ 3.. సైన్ చేసిన 'ఫిదా' బ్యూటీ!

ఇప్పుడు ఈ లిస్ట్ లో మరోపేరు వినిపిస్తోంది. నటి గాయత్రి గుప్తా బిగ్ బాస్ 3కి సైన్ చేసిందని సమాచారం. శేఖర్ కమ్ముల రూపొందించిన 'ఫిదా' సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించింది గాయత్రి గుప్తా.. ఆ తరువాత పలు ఇంటర్వ్యూలలో వివాదాస్పద కామెంట్స్ చేసి పాపులారిటీ దక్కించుకుంది. 
 

 

బొండా ఉమా కు హైకోర్టులో చుక్కెదురు

టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు కి హైకోర్టులో చుక్కెదురైంది. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ ఫలితంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బొండా ఉమా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ కేసులో వాదోపవాదాలు విన్న న్యాయస్థానం .
 

షాక్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రాజీనామా

ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడ తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రయోజనాల కోసమే తాను రాజీనామా చేసినట్టుగా ఆయన ప్రకటించారు. ఎలాంటి పదవి లేకపోయినా కూడ  పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 
 

కాంగ్రెస్ పదవికి వీహెచ్ రాజీనామా

రాహుల్ గాంధీ రాజీనామా ఉపసంహరించుకోవాలని కోరారు. గాంధీ కుటుంబం పక్కకి తప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ మనుగడకే ప్రమాదమన్నారు. పారాచూట్లకు టికెట్లు ఇవ్వడం వల్లే నష్టం వాటిల్లిందనిలేని చెప్పుకొచ్చారు. 
 

నాతో పాటు కష్టపడ్డాడు: హరీష్‌రావుపై కేసీఆర్‌ ప్రశంసలు

మాజీ మంత్రి హరీష్‌రావును పిలిచి మరీ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని  కోరారు. పార్టీ ఆవిర్భావం నుండి  తనతో పాటు హరీష్ రావు టీఆర్ఎస్‌ బలోపేతం చేసేందుకు ప్రయత్నించారని కేసీఆర్ ప్రశంసలు కురిపించారు.  
 

.ఏపీ నుంచి బీజేపీలోకి భారీ వలసలు: జంప్ చేసేందుకు 75 మంది కీలక నేతలు రెడీ

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పై చర్చించారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలపై సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో వివిధ పార్టీలకు చెందిన సుమారు 75 మంది కీలక నేతలు బీజేపీలో చేరనున్నారని వారి చేరికపై కూడా సమావేశంలో చర్చించారు.
 

పరువు హత్య: మృతదేహంతో ఆందోళన, నిందితుల కోసం నాలుగు టీమ్‌ల గాలింపు

హేమావతి మృతదేహంతో  కేశవులు కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు  ఆందోళనకు దిగారు. భాస్కరనాయుడు కుటుంబసభ్యులను కఠినంగా శిక్షించాలని  డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్ తో ఆందోళన చేస్తున్న  బాధిత కుటుంబంతో పోలీసులు చర్చిస్తున్నారు
 

ఆంధ్రోళ్లను అరెస్టు చేస్తారా..? సీఎంల భేటీలో ఆసక్తికర చర్చ

 ఆయా సమస్యలపై చర్చించేందుకు మళ్లీ ఎప్పుడు భేటీ అవుతారని కేసీఆర్‌ తమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని అడిగారు. ‘‘వీళ్లు (ఏపీ అధికారులు) ఇక్కడి నుంచి వెళితే మళ్లీ దొరకరు. ఈ సమావేశం ముగిసిన వెంటనే భేటీ అవుతాం. రాత్రి పొద్దుపోయేవరకు, అవసరమైతే మరునాడు కూడా కూర్చుంటాం. అప్పటివరకు వీళ్లను అమరావతికి వెళ్లనిచ్చేది లేదు’’ అని ఎస్కే జోషి సరదాగా అన్నారు. 
 

ఆ ఎన్నికల్లో  అధికారానికి దూరమైన తర్వాత చంద్రబాబునాయుడు హైద్రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి  ప్రతి రోజూ వచ్చేవారు. ఉదయం పూట పార్టీ కార్యాలయానికి వచ్చేవారు. మధ్యాహ్నం పూట భోజనం కూడ పార్టీ కార్యాలయంలోనే చేసేవారు.  అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు పార్టీ కార్యాలయంలోనే నిద్రపోయేవారు. సాయంత్రం పూట మళ్లీ పార్టీ నేతలతో కలిసేవారు.
 

కాంగ్రెస్ పార్టీకి బ్యాటరీ లేదు, చార్జింగ్ అయిపోయింది: మురళీధర్ రావు

దేశంలో కార్యకర్తలు మాత్రమే నడిపించే ఏకైక పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ పార్టీకి లేనంతగా 11 కోట్ల సభ్యత్వం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని ఆపడం ఎవరి తరం కాదన్నారు. టీఆర్ఎస్ ను వ్యతిరేకించే వారికి బీజేపీ మద్దతు ఉంటుందని తెలిపారు. తెలంగాణలో అత్యధికంగా బీజేపీ సభ్యత్వ నమయోదు చేయాలని కార్యకర్తలకు సూచించారు మురళీధర్ రావు. 


 

బాలీవుడ్ భామతో కెఎల్ రాహుల్ ప్రేమాయణం..? సోషల్ మీడియాలో ఫోటోలు హల్ చల్

యువ క్రికెటర్ కెఎల్ రాహుల్ తో బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి ప్రేమించుకున్నట్లు అటు క్రికెట్ వర్గాల్లో, ఇటు సీని వర్గాల్లోను గుసగుసలు వినబడుతున్నాయి. అయితే గతంలో నిధి అగర్వాల్, సోనాల్ చౌహాన్, ఆకాంక్ష రంజన్ లతో రాహుల్ ప్రేమాయణం సాగిస్తున్న ప్రచారం జరిగింది. అప్పుడు కూడా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.  తాజాగా అతియా శెట్టి తో రాహుల్ కలిసున్న ఫోటోలు భయటకు రావడంతో వారి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 


నౌహీరా, క్యూనెట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన బాలీవుడ్ స్టార్లను పోలీసులు గుర్తించారు. క్యూనెట్ కేసులో ఏడుగురు సినిమా తారలకు నోటీసులు పంపించారు. అల్లు శిరీష్, బొమన్ ఇరాని, వివేక్ ఒబెరాయ్, అనీల్ కపూర్, జాకీష్రాఫ్, పూజాహెగ్డే, షారుఖ్ ఖాన్ వంటి తారలకు నోటీసులు జారీ చేశారు.
 

 

కామా పెడితే దాన్ని ఫుల్ స్టాప్ అనుకున్న జగన్ ఈ గ్యాప్‌లోనే గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాల‌నుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. దేవుడు కామా త‌రువాత మ‌ళ్లీ  స్క్రిప్ట్ రాయ‌డం మొద‌లుపెట్టాడని చెప్పుకొచ్చారు. 
 

మున్సిఫల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్: సాగర్‌లో మీటింగ్

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం శనివారం నాడు ప్రారంభమైంది. రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలు, మున్సిఫల్ ఎన్నికల్లో  అవలంభించాల్సిన వ్యూహంతో పాటు వలసలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
 

మరో గ్రూప్ రక్తం ఎక్కించిన వైద్యులు, బాలింత మృతి: నలుగురిపై వేటు

బాధితురాలి భర్త ఈ విషయమై  ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. అయితే  ఆసుపత్రి సిబ్బంది బుకాయించారు. ఈ విషయాన్ని  రహస్యంగా ఉంచే ప్రయత్నం చేశారు.అయితే మీడియా ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది.దీనిపై కలెక్టర్ సత్యనారాయణ విచారణ చేశారు.
 

 

గంగూలీ చొక్కా విప్పేశాడని.. సామాజిక కట్టుబాట్లు బద్దలు కొట్టిన యువతి!

సామజిక కట్టుబాట్ల మధ్య, ఆడవాళ్లంటే చులకనగా చూసే ప్రాంతంలోని యువతి గంగూలీని చూసి ప్రేరణ పొందుతుంది. కట్టుబాట్లని బద్దలు కొట్టుకుని స్వతంత్రంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. 1947లో రాజకీయ స్వాత్రంత్రం వచ్చింది.. 1991లో ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. 2002లో భావోద్వేగాల స్వాతంత్రం వచ్చింది అంటూ ట్రైలర్ లో బ్యాగ్ గ్రౌండ్ లో వినిపిస్తున్న డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. 

 

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో బాలయ్య.. ఇది నందమూరి వారి 'మనం'?


ప్రస్తుతం బాలయ్య రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలపై ఆసక్తి చూపడం లేదట. కొత్తదనం కోసం ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తే ఎలా ఉంటుంది..అందులో నందమూరి హీరోలంతా కలసి నటిస్తే ఎలా ఉంటుంది అని తన ఆలోచనని బాలయ్య సన్నిహితులతో వ్యక్తపరిచినట్లు ఫిలిం నగర్ టాక్. అంటే ఇది నందమూరి వారి మనం అన్నమాట. 
 

బిగ్ డౌట్ : 'బిగ్‌బాస్‌3'లో ఇంకో కౌశల్ ఉన్నాడా..?

ఎందుకంటే కౌశల్ బిగ్ బాస్ లోకి వచ్చేముందే తన భార్య సాయింతో కౌశల్ ఆర్మిని ఓ ప్లానింగ్ ప్రకారం నడిపించారు. ఆఖరికి సీజన్ లో గెలిచారు. మరి ఇప్పుడు బిగ్ బాస్ 3 కూడా త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ నేపధ్యంలో కౌశల్ లాంటి ప్లానింగ్ ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారు. షోకు క్రేజ్ తెచ్చే క్యాండిడేట్ ఎవరనేదే చర్చయనీయాంసంగా మారింది. 
 

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ పీటర్సన్, ఆటగాడు మైకెల్ వాన్ లు మోర్గాన్ సేనపై నిప్పులు చెరిగారు. ఈ టోర్నీలో ఓటములతో సతమతమవుతున్న శ్రీలంక వంటి జట్టు చేతిలో కూడా ఇంగ్లాండ్ ఓటమిపాలవ్వడం సిగ్గుచేటని అన్నారు.

 

click me!