మీకు గుర్తుండే ఉండి ఉంటుంది బిగ్ బాస్ 2 సీజన్ సక్సెస్ అవ్వటానికి ప్రధాన కారణం కౌశల్. నాని వ్యాఖ్యతగా తగ్గిన డోస్ ని కౌశల్ ఫిల్ చేసాడు. సీజన్ చివరి వరకూ అంటే కౌశల్ విజేతగా నిలిచేదాకా టెంపోని తన కౌశల్ ఆర్మీ సాయింతో కౌశల్ నిలపెట్టాడు. ఈ విషయం బిగ్ బాస్ 2 ని క్లోజ్ గా అబ్జర్వ్ చేసినవారంతా ఒప్పుకుంటారు.  

ఎందుకంటే కౌశల్ బిగ్ బాస్ లోకి వచ్చేముందే తన భార్య సాయింతో కౌశల్ ఆర్మిని ఓ ప్లానింగ్ ప్రకారం నడిపించారు. ఆఖరికి సీజన్ లో గెలిచారు. మరి ఇప్పుడు బిగ్ బాస్ 3 కూడా త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ నేపధ్యంలో కౌశల్ లాంటి ప్లానింగ్ ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారు. షోకు క్రేజ్ తెచ్చే క్యాండిడేట్ ఎవరనేదే చర్చయనీయాంసంగా మారింది. 

మాటీవి  ప్రేక్షకులను అలరించిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. ఇప్పటివరకూ రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ముచ్చటగా మూడో ఏడాది సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారన్న ఊహాగానాలకు చెక్ చెప్తూ నాగార్జున అని రివీల్ చేసేసారు.   నాగార్జున ‘బిగ్‌బాస్‌3’కు యాంకర్ గా  వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్‌ను ‘స్టార్‌ మా’ అభిమానులతో పంచుకుంది.

ఈ నేపధ్యంలోఈ సీజన్‌లో 14మంది బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లనున్నారు. మొత్తం 100 రోజుల పాటు ఈ షోను నిర్వహించనున్నారు. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌, రెండో సీజన్‌కు నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక తొలి సీజన్‌ విజేతగా శివబాలాజీ, రెండో సీజన్‌ విజేతగా కౌశల్‌లు నిలిచారు. మరి ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌లో వెళ్లేది.. విజేతగా నిలిచేది ఎవరో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే!