బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో తెలుగులో మూడో సీజన్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ప్రోమోలు వచ్చేశాయి. హోస్ట్ గా నాగార్జున కనిపించనున్నారు.

పోటీదారులుగా ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించాయి. సోషల్ మీడియాలో ఓ లిస్ట్ కూడా కనిపించింది. లాస్య, గుత్తా జ్వాలా, నందు, హేమచంద్ర వంటి సెలబ్రిటీల పేర్లు వినిపించాయి. అయితే వారంతా కూడా ఆవార్తలు ఫేక్ అని కొట్టిపారేశారు. ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన కంటెస్టంట్లలో యాంకర్ శ్రీముఖి ఉంది.

ఇప్పుడు ఈ లిస్ట్ లో మరోపేరు వినిపిస్తోంది. నటి గాయత్రి గుప్తా బిగ్ బాస్ 3కి సైన్ చేసిందని సమాచారం. శేఖర్ కమ్ముల రూపొందించిన 'ఫిదా' సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించింది గాయత్రి గుప్తా.. ఆ తరువాత పలు ఇంటర్వ్యూలలో వివాదాస్పద కామెంట్స్ చేసి పాపులారిటీ దక్కించుకుంది. 

ఆమెని షోలో తీసుకోవడం ద్వారా మరింత మసాలా యాడ్ చేయొచ్చని భావిస్తున్నారు. ఈమెతో పాటు 'జబర్దస్త్' షో కమెడియన్ రోహిణి కూడా బిగ్ బాస్ లో కనిపించనుందని సమాచారం. ఈమె పలు సీరియళ్లు, సినిమాలలో కూడా నటించింది.