హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మరో కూల్చివేతకు కూడా పూనుకుంటున్నారు. మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో ప్రస్తుతం ఉన్న తన ఫామ్ హౌస్ ను కూల్చిసి, కొత్త ఫామ్ హౌస్ ను నిర్మించాలనే ఆలోచనకు ఆయన శ్రీకారం చుట్టారు. 

గురువారంనాడే కేసీఆర్ ఎర్రవెల్లిలో కొత్త ఫామ్ హౌస్ కు శంకుస్థాపన చేసినట్లు తెలుస్తోంది. కొత్త సచివాలయానికి, శాసనసభకు శంకస్థాపన చేయడానికి ముందే ఆ పనిచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ హౌస్ సరిపోవడం లేదని, దానికన్నా పెద్దది నిర్మించాలని ఆయన తలపెట్టినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం పగటిపూట మాత్రమే ఫామ్ హౌస్ కు వెళ్లాల్సి వస్తోందని, రాత్రి అక్కడ బస చేయడానికి వీలు కావడం లేదని అంటున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లిని తన స్థిరనివాసంగా ఏర్పాటు చేసుకోవానలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయన కొత్త నిర్మాణాలకు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ఉన్న ఫామ్ హౌస్ కుటుంబ సభ్యులంతా ఉండడానికి కూడా వీలు కల్పించడం లేదని సమాచారం దాంతో పెద్ద నిర్మాణం చేపట్టాలని ఆయన చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే అక్కడే ఉండి తనకు ఇష్టమైన వ్యవసాయం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.