2002లో టీమిండియా ఇంగ్లాండ్ పై నాట్ వెస్ట్ సిరీస్ లో విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ ని ఏ క్రికెట్ అభిమాని అంత సులువుగా మరచిపోలేదు. టీమిండియా సాధించిన చిరస్మరణీయ విజయాల్లో ఒకటిగా నిలిచింది ఆ మ్యాచ్. ఇదంతా ఒకెత్తయితే అప్పటి కెప్టెన్ గంగూలీ సంతోషంతో చొక్కా విప్పి సంతోషంతో గంతులేయడం మరో ఎత్తు. 

ఈ అంశాన్నే ఆధారంగా తీసుకుని దర్శకుడు అభినయ్ దేవ్ 'దూస్రా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర టైలర్ అందరిని విశేషంగా ఆకట్టుకుంటోంది. గంగూలీ చొక్కా విప్పడంతో ఓ యువతి ఎలా ప్రేరణ పొందింది అనేదే ఈ చిత్ర కథ. 'లిప్ స్టిక్ అండర్ మై బుర్కా' ఫేమ్ ప్లబితా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. 

సామజిక కట్టుబాట్ల మధ్య, ఆడవాళ్లంటే చులకనగా చూసే ప్రాంతంలోని యువతి గంగూలీని చూసి ప్రేరణ పొందుతుంది. కట్టుబాట్లని బద్దలు కొట్టుకుని స్వతంత్రంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. 1947లో రాజకీయ స్వాత్రంత్రం వచ్చింది.. 1991లో ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. 2002లో భావోద్వేగాల స్వాతంత్రం వచ్చింది అంటూ ట్రైలర్ లో బ్యాగ్ గ్రౌండ్ లో వినిపిస్తున్న డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి.